AP CM YS JAGAN LIKELY TO ALLOT CRDA CHAIRMAN POST TO MANGALAGIRI MLA ALLA RAMAKRISHNA REDDY SK
లోకేష్‌పై గెలిచిన ఆళ్లకు కీలక పదవి...జగన్ ఆఫర్ ఇదేనా..?
జగన్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (Image : Twitter)
మంగళగిరిలో చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి లోకేశ్‌పై పోటీచేసి గెలిచారు ఆళ్ల. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గంలో పట్టునిలుపుకొని టీడీపీని దెబ్బకొట్టింది వైసీపీ. ఏకంగా సీఎం కుమారుడిని ఓడించి ఆళ్ల రామకృష్ణారెడ్డి సత్తాచాటారు.
వైఎస్ జగన్ కేబినెట్లో 25 మంది మంత్రులుగా ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో వారికి పదవులను పంచడం జగన్‌కు కాస్త ఇబ్బందిగానే మారింది. ఎంతో మంది కీలక నేతలున్నా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు, సీనియారిటీ దృష్ట్యా కొందరు నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. అలాంటి నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు జగన్. ఇప్పటికే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నగరి ఎమ్మెల్యే రోజాకు apiic ఛైర్మన్ పదవి ఇచ్చారు. అదే బాటలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కీలక పదవి ఇవ్వబోతున్నట్లు సమాచారం.
మంగళగిరిలో చంద్రబాబునాయుడు తనయుడు, మంత్రి లోకేశ్‌పై పోటీచేసి గెలిచారు ఆళ్ల. ఏకంగా సీఎం కుమారుడిని ఓడించి ఆళ్ల రామకృష్ణారెడ్డి సత్తాచాటారు. రాజధాని ప్రాంతంలో ఉన్న ఆ నియోజకవర్గంలో పట్టునిలుపుకొని టీడీపీని దెబ్బకొట్టింది వైసీపీ. దాంతో జగన్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ జగన్ కేబినెట్లో ఆళ్లకు చోటు దక్కలేదు. ఐతే CRDA (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లోనే ప్రకటన వెలువడవచ్చని సమాచారం.
అమరావతి నిర్మాణంలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని సేకరించింది. ఐతే కుట్రపూరితంగా భూములు కొనుగోలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు వ్యవసాయ భూములపై అవగాహన ఉంది. అంతేకాదు రాజధాని పరిధి ఎమ్మెల్యేగా సీఆర్డీయేపైనా మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో సీఆర్డీయే ఛైర్మన్ పదవిని ఆళ్లకు ఇవ్వడమే సరైందని జగన్ భావిస్తున్నారట.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.