రాజధాని పదం రాజ్యాంగంలోనే లేదు.. జగన్ కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీని రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని.. ఎక్కడి నుంచైనా చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో అసలు రాజధాని పదమే లేదని అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం.


Updated: January 23, 2020, 7:31 PM IST
రాజధాని పదం రాజ్యాంగంలోనే లేదు.. జగన్ కీలక వ్యాఖ్యలు
వైఎస్ జగన్
  • Share this:
ఏపీ రాజధాని తరలింపుపై దుమారం కొనసాగుతోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసన మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. చట్టాలను అడ్డుకుంటున్న అలాంటి మండలి మనకు అవసరమా? అని అసెంబ్లీలో ఆయన అన్నారు. ఈ క్రమంలో రాజధాని తరలింపు అంశంపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. అసెంబ్లీని రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని.. ఎక్కడి నుంచైనా చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగంలో అసలు రాజధాని పదమే లేదని అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం. పరిపాలనా వికేంద్రీకరణ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అధికారమని చెప్పారు.

''రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. సీట్ ఆఫ్ గవర్నెన్స్‌ అని మాత్రమే ఉంటుంది. అడ్మినిస్ట్రేన్ కోసం సీట్ ఆఫ్ గవర్నెన్స్‌ని డీసెంట్రలేషన్ చేసుకోవచ్చు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం పరిపాలనా వికేంద్రీకరణ చేసే స్వేచ్ఛ ప్రజలు ఇచ్చిన అధికారం. జయలలిత ఉన్నప్పుడు ఊటీ నుంచి ప్రభుత్వాన్ని నడిపారు. హుదూద్ వచ్చినప్పుడు చంద్రబాబు విశాఖపట్నం నుంచే పరిపాలన చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడి నుంచి పాలన సాగుతుంది. దీనికి ఏ బిల్లు అవసరం లేదు. చట్టం అవసరం లేదు. సభలో తీర్మానం చేసి రాష్ట్రలో ఎక్కడి కూర్చోనైనా పరిపాలన చేయవచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టవచ్చు. ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చు. ఇది చట్టం. ఇదే రాజ్యాంగం.'' అని సీఎం జగన్ అన్నారు
First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading