Home /News /politics /

AP CM YS JAGAN GOING TO NEW DELHI ON OCTOBER 5 TO MEET PM NARENDRA MODI SK

ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ.. కేసీఆర్ కూడా..

వైఎస్ జగన్

వైఎస్ జగన్

తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస రోజుల్ లో ఢిల్లీలో ప్రధాని మోదీని కలవబోతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

    ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్టోబరు 5న ఢిల్లీలో పర్యటించనున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. మోదీతో భేటీలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది. గత నెలలోనూ ఢిల్లీలో పర్యటించారు సీఎం జగన్. ఆగస్టు 6న ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

    మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గురువారం ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం సహా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం అంశంపై సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు వరుస రోజుల్లో ప్రధాని మోదీని కలవబోతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇటీవల కేసీఆర్, జగన్ హైదరాబాద్‌లో సమావేశమై ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయాల్సిందిగా ఇరువురు సీఎంలు మోదీని కోరే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, New Delhi, Pm modi, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు