కేసీఆర్ బాటలో జగన్... చంద్రబాబుపై ప్రయోగం

ఏపీలో చంద్రబాబును ఢీ కొట్టేందుకు సీఎం జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాన్ని ఫాలో అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: September 13, 2019, 7:43 PM IST
కేసీఆర్ బాటలో జగన్... చంద్రబాబుపై ప్రయోగం
సీఎం వైఎస్ జగన్
  • Share this:
రాజకీయాల్లో ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును ఢీ కొట్టాలంటే ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుని చంద్రబాబును, టీడీపీని మట్టికరిపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా చంద్రబాబుకు చెక్ చెప్పేందుకు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు చంద్రబాబు తలపెట్టిన చలో ఆత్మకూరు విషయంలో ఏపీ సీఎం జగన్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

గ్రామాల్లో వైసీపీ బాధితులుగా ఉన్న టీడీపీ శ్రేణులను ఒక శిబిరానికి తీసుకొచ్చి... మళ్లీ వాళ్ల గ్రామాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇందుకోసం చలో ఆత్మకూరు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీడీపీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవడం... చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడటం కూడా జరిగిపోయాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏపీ సీఎం జగన్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారని టాక్ వినిపిస్తోంది.

టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరుపై కాని, ఈ కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై కాని జగన్ స్పందించలేదు. అసలు టీడీపీ ఏం చేస్తుందో తనకు తెలియదన్నట్టుగా సీఎం జగన్ వ్యవహరించారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారంలో సీఎం జగన్ వ్యూహాత్మక మౌనం పాటించారు. అయితే ఇదే ఆయనకు కలిసొచ్చిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఒకవేళ ఈ వ్యవహారంపై సీఎం జగన్ స్పందించి ఉంటే టీడీపీ మరింత దూకుడు ప్రదర్శించేదని... అలా జరగకుండా ఉండేందుకే జగన్ సైలెంట్‌గా ఉంటూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టుగా వ్యవహరించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి వ్యూహాత్మక మౌనం పాటించే విషయంలో సీఎం కేసీఆర్ దిట్ట. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఫాలో అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు