సీఎం జగన్ కేసీఆర్ సలహాను పాటిస్తున్నారా..?

సీఎం కేసీఆర్ అమరావతిపై ఇచ్చిన సలహాను చంద్రబాబు పాటించకపోయినా... ఏపీ కొత్త సీఎం జగన్ పాటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: September 16, 2019, 7:51 PM IST
సీఎం జగన్ కేసీఆర్ సలహాను పాటిస్తున్నారా..?
జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్)
  • Share this:
ఏపీ రాజధాని అమరావతి విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏపీ రాజధాని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదంతా వృధా అని తాను చంద్రబాబుకు సలహా ఇచ్చానని... కానీ చంద్రబాబు ఆ విషయంలో తన మాట పట్టించుకోలేదని అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు సీఎం కేసీఆర్. దీనికి బదులుగా రాయలసీమకు నీరు ఇవ్వాలని చెప్పానని చంద్రబాబుకు చెప్పానని అన్నారు. అమరావతి విషయంలో మాట్లాడని కొందరు వ్యక్తులు... తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడుతున్నారని జేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అయితే సీఎం కేసీఆర్ అమరావతిపై ఇచ్చిన సలహాను చంద్రబాబు పాటించకపోయినా... ఏపీ కొత్త సీఎం జగన్ పాటిస్తున్నారేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అమరావతి అంశంలో గతంలో చంద్రబాబుకు ఇచ్చిన సలహానే సీఎం కేసీఆర్ జగన్‌కు కూడా ఇచ్చారేమో అనే టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే అమరావతి నిర్మాణానికి బదులుగా రాయలసీమకు నీరిచ్చే అంశంపై జగన్ ఎక్కువగా దృష్టి పెట్టారేమో అనే చర్చ కూడా సాగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలను బట్టి శ్రీశైలానికి గోదావరి జలాలను తరలిస్తే... రాయలసీమ మొత్తానికి నీరు ఇవ్వొచ్చనే ఆలోచన జగన్‌కు నచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అందుకే అమరావతి నిర్మాణానికి బదులుగా గోదావరి జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకెళ్లే అంశంపై సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
First published: September 16, 2019, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading