హోమ్ /వార్తలు /politics /

AP Government: సలహాదారులపై జగన్ కి నమ్మకం సడలిందా..? వాళ్లని సాగనంపడం ఖాయమేనా..?

AP Government: సలహాదారులపై జగన్ కి నమ్మకం సడలిందా..? వాళ్లని సాగనంపడం ఖాయమేనా..?

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో (Andhra Pradesh Government) మంత్రుల కంటే సలహాదారుల సంఖ్యే ఎక్కువ. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) కేబినెట్ సంఖ్య (25) కంటే కూడా ఒకటిన్నర రెట్లు అంటే 33 మందితో అడ్వైజరీ కమిటీని (సలహాదారులు) నియమించుకున్న విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో (Andhra Pradesh Government) మంత్రుల కంటే సలహాదారుల సంఖ్యే ఎక్కువ. గతంలో ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) కేబినెట్ సంఖ్య (25) కంటే కూడా ఒకటిన్నర రెట్లు అంటే 33 మందితో అడ్వైజరీ కమిటీని (సలహాదారులు) నియమించుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక్కొక్కరికి నెలకు రూ. 3 లక్షలు జీతంతో పాటు ప్రతి నెలా రెండు లక్షల అలవెన్సులు ఇవి కాకుండా ఆఫీస్, కారు, డ్రైవర్, పి.ఎస్ వంటి సదుపాయాలు అదనం. ఓ ఐదారుగురు సలహాదారులకు క్యాబినెట్ ర్యాంక్ తో పాటు ప్రోటోకాల్ అదనం. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో సలహాదారులకు ఇంతలేసి జీతాలు, ఇన్ని వసతులు, ఇంత హంగామా అవసరమా అని ఒకా నొక సందర్భంలో ఎపీ హైకోర్టు ప్రభుత్వానికి అంక్షింతలు వేసిన సందతి తెలిసిందే..!

  సౌకర్యాలపై విమర్శలు...

  కొన్ని కారణాల వల్ల రాజకీయంగా అవకాశం దక్కనివారు, పార్టీకి సేవ చేసినా పదవులు రానివారు, రాజకీయంగా, సంస్థాగతం, వ్యక్తిగతంగా సీఎం జగన్ కు సహకరించిన వారు, ఆబ్లిగేషన్స్ ఉన్నవారిని ప్రభుత్వంలో సలహాదారులగా నియమించారు. సలహాదారులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు న్యాయమూర్తులు, సి.ఎస్, డి.జి.పి వంటి వారికి కూడా కల్పించడం లేదని, ప్రభుత్వ శైలి ప్రజాధనం లూటీ చేసేమాదిరిగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం సలహాదారులపై మాటపడనీయడం లేదు. ఇంత చేసినా వీరి వల్ల ప్రభుత్వానికి ఉపయోగం లేకపోగా, నష్టమే ఎక్కువ జరుగుతుందనే అభిప్రాయం ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలోనూ వ్యక్తమవుతోంది.

  ఇది చదవండి: ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్..? ముహూర్తం ఆ రోజేనా..?  ఖర్చు తప్ప.. ప్రయోజనం లేదా..?

  ఇంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ అవసరం వచ్చినా మళ్ళీ ప్రశాంత్ కిశోర్ టీమ్ ని రంగంలోకి దించక తప్పని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అనగానే ప్రశాంత్ కిశోర్ టీమ్ సర్వే నిర్వహించి ఏ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి,ఎవరిని పదవి నుండి తప్పించాలి వంటి సలహాలు ఇస్తోంది. కొన్ని కీలక అంశాల్లో తమను సంప్రదించకపోవడం, తమకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకోవడంతో కొందరు సలహాదారులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. నెలనెలా కోట్లలో ఖర్ఛు పెట్టి సలహాదారులను నియమించుకుంటే వారిచ్చే సలహాలు పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా చెడ్డపేరు తెచ్చేలా ఉంటున్నాయని, పైగా 33 మంది సలహాదారులలో కేబినెట్ ర్యాంక్ ఉన్న , జుల్ఫీరావ్డీ, సాగి దుర్గా ప్రసాదరాజు, తలశిల రఘురాం, జీవీడీ కృష్ణమోహన్, దేవులపల్లి అమర్, పీటర్ హాసన్, ఎం. శామ్యూల్ వంటి వారి పాత్ర నామనాత్రంగానే ఉంది తప్ప ప్రభుత్వానికి, పార్టీకి ఉపయోగపడటంలేదనే భావన వ్యక్తమవుతోంది.

  ఇది చదవండి: పెట్రోల్ తో పోటీ పడుతున్న టమాటా... ధర తెలిస్తే అదిరిపోవాల్సిందే..!


  అప్పుడు యాక్టివ్.. ఇప్పుడు సైలెంట్..!

  అప్పట్లో జగన్ పాదయాత్ర ఏర్పాట్లు పర్యవేక్షించిన తలశిల రఘురాం ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అటు సమర్ధించలేక ఇటు గట్టిగా ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపించ లేక సతమతమయ్యో దేవులపల్లి అమర్, జగన్ ఉపన్యాసాలు రాసే జీ.వి.డి. కృష్ణమోహన్ వంటి వారి వల్ల ప్రయోజనం శూన్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరో క్యాబినెట్ ర్యాంక్ హోదా సలహాదారు మరియు గల్ఫ్ దేశాల ప్రతినిధి జుల్ఫీరావ్డినీ అసలు చాలా మందికి తెలీనే తెలీదని చెప్పాలి.

  ఇది చదవండి: దూసుకొస్తున్న వాయుగుండం... 24గంటలు హై అలర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక..


  సజ్జలపై వ్యతిరేకత..?

  ఇక అందరికీ సుపరిచితుడు జగన్ కి అత్యంత ఆప్తుడు,అన్నిశాఖల మంత్రి అని ప్రతిపక్షాలు ముద్దుగా పిలుచుకునే సజ్జల రామకృష్ణా రెడ్డి ముఖ్యమంత్రిని తన గుప్పెట్లో పెట్టుకుని షాడో సి.యం లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అతని వల్ల అనేక మంది సీనియర్ రాజకీయ నాయకులు జగన్ కు దూరమౌతున్నారనే వాదనలూ లేక పోలేదు. ఒక్కోసారి మంత్రుల బదులు కూడా సజ్జలే ప్రెస్ మీట్లు పెడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

  ఇది చదవండి: చంద్రబాబు కంచుకోటకు బీటలు.. వైసీపీ ఖాతాలో కుప్పం మున్సిపాలిటీ


  ఇక మిగిలిన సలహాదారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది వారికి నెల తిరిగేసరికి ఠంచనుగా జీతభత్యాలు అందుకుంటారు తప్ప వారు సలహాలు ఇచ్చేది లేదు ప్రభుత్వం తీసుకునేది లేదు. ఇప్పటికే జగన్ సలహాదారుల విషయమై ఓ నిర్ణయానికి వచ్చారని, క్యాబినెట్ విస్థరణ అనంతరం సలహాదారులలో కొంతమందిని సాగనంపే అవకాశం ఉందనేది సీఎంఓలోని కొందరు అధికారుల మాట.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, Sajjala ramakrishna reddy, Ysrcp

  ఉత్తమ కథలు