ఎన్టీఆర్ అల్లుడికి జగన్ షాక్... వ్యూహం మారిందా..?

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీ వైపు కాకుండా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి.

news18-telugu
Updated: September 27, 2019, 1:07 PM IST
ఎన్టీఆర్ అల్లుడికి జగన్ షాక్... వ్యూహం మారిందా..?
వైఎస్ జగన్
  • Share this:
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుతుంటాయి. పరిస్థితులకు తగ్గట్టుగా నేతలు కూడా నిర్ణయం తీసుకుంటుంటారు. తాజాగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం కొందరు నేతల విషయాలు తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారేమో అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లలో గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన వైసీపీ... కొన్ని స్థానాల్లో మాత్రమే ఓడిపోయింది. అలాంటి స్థానాల్లో చంద్రబాబు తోడల్లుడు, సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసిన పర్చూరు స్థానం ఒకటి.

పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిస్తే...ఆయన అసెంబ్లీ స్పీకర్ అయ్యే అవకాశం ఉందని ఎన్నికల ఫలితాలు రాకముందు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. వైసీపీ రాజకీయాల్లో ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దగ్గుబాటి దంపతుల రాజకీయ వారసుడు హితేష్ చెంచురామ్ సైతం వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అయితే తాజా పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన రావి రామనాథంబాబును తిరిగి పార్టీలోకి చేర్చుకుంది అధికార పార్టీ.

daggubati venkateshwara rao, daggubati purandeswari, Hitesh chenchuram, ysrcp, ycp, bjp, parchuru, chandrababu naidu, tdp, ap latest news, ap politics, Ap cm ys jagan, ramanatham babu, prakasam district, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, హితేష్, ఏపీ సీఎం జగన్, పర్చూరు, టీడీపీ, వైసీపీ, ప్రకాశం జిల్లా, ఏపీ న్యూస్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం (File)


అయితే రామనాథంబాబు చేరిక విషయంపై డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కనీస సమాచారం ఇచ్చారా లేదా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో తన టికెట్ రాకపోవడంతో రామనాథంబాబు టీడీపీలో చేరారు. అయితే తాజాగా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో పార్టీలో చేరడం ఆసక్తిరేపుతోంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న డాక్టర్‌ దగ్గుబాటి కానీ, ఆయన కుమారుడు హితేష్‌ చెంచురామ్‌ కానీ కనిపించలేదు. దీంతో దగ్గుబాటికి చెక్ చెప్పేందుకే రామనాథంబాబును మళ్లీ పార్టీలోకి తీసుకున్నారనే గుసగుసలు మొదలయ్యాయి.

మరోవైపు ఎన్నికల తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీ వైపు కాకుండా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇది కూడా వైసీపీ నాయకత్వానికి దగ్గుబాటిపై నమ్మకం తగ్గడానికి ఓ కారణమై ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై దగ్గుబాటి వెంకటేవ్వరరావు స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: September 27, 2019, 1:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading