సీఎం జగన్ నిర్ణయంతో అయోమయంలో చంద్రబాబు..?

రాష్ట్రం మొత్తం అభివృద్ధి సాధించే దిశగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు సీఎం జగన్. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టును ఉంచబోతున్నట్లు ఆయన సూత్రప్రాయంగా చెప్పారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు చిక్కుగా మారింది.

news18-telugu
Updated: December 20, 2019, 4:36 PM IST
సీఎం జగన్ నిర్ణయంతో అయోమయంలో చంద్రబాబు..?
సీఎం జగన్ నిర్ణయంతో అయోమయంలో చంద్రబాబు..?
  • Share this:
ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రచ్చ అంతా రాజధానిపైనే. అమరావతి ఉనికిని దెబ్బతీయొద్దంటూ టీడీపీ, మూడు రాజధానులు అంటూ వైసీపీ గళం ఎత్తుకున్నాయి. ఈ సమస్యపైనే రాష్ట్రంలో హీట్ చర్చ సాగుతోంది. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిని రాజధానిగా ఎంచుకున్నారు. అక్కడ మౌలిక ఏర్పాట్లు, అభివృద్ధి కోసం చర్యలు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్లు తిరిగే సరికి టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే రాజధానికి అమరావతి అనువైనది కాదని చెబుతూ వస్తోంది. దీని గురించి చర్చ నడుస్తున్న క్రమంలోనే సీఎం జగన్ ఓ కమిటీని నియమించి.. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. అయితే.. కేంద్రం కొత్త భారతదేశ మ్యాప్ రిలీజ్ చేయడంతో సమస్య మరింత హీటెక్కింది. అందులో అమరావతి పేరు లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కొన్ని రోజులకే అమరావతి పేరును చేర్చుతూ మరో మ్యా్ప్ రిలీజ్ చేయడంతో కాస్త కుదుట పడ్డారు.

అయితే.. రాష్ట్రం మొత్తం అభివృద్ధి సాధించే దిశగా మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు సీఎం జగన్. విశాఖపట్నంలో సెక్రటేరియట్, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలులో హైకోర్టును ఉంచబోతున్నట్లు ఆయన సూత్రప్రాయంగా చెప్పారు. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు చిక్కుగా మారింది. జగన్ ప్రతిపాదనను చంద్రబాబు వ్యతిరేకిస్తే ఆయా ప్రాంతాల్లోని ప్రజలు పార్టీకి దూరం అవుతారని బాబు భయపడుతున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతి మాత్రమే రాజధాని అని మొన్నటి వరకు చెప్పుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడూ దానికే కట్టుబడి ఉంటే మిగతా ప్రాంతాల్లో టీడీపీకి దెబ్బ పడుతుందని చెబుతున్నారు. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు జగన్ భారీ అస్త్రాన్నే ప్రయోగించారని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 20, 2019, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading