అమరావతిపై జగన్ కొత్త ఆలోచన... టీడీపీకి షాక్ ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమితమైందని... ఈ కారణంగానే విభజన తరువాత ఏపీ నష్టపోయిందనే భావనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: August 23, 2019, 4:32 PM IST
అమరావతిపై జగన్ కొత్త ఆలోచన... టీడీపీకి షాక్ ?
సీఎం జగన్, అమరావతి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అధికారంలోకి వచ్చినప్పుడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాలను సమీక్షిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్... రాజధాని అమరావతి విషయంలోనూ పునరాలోచన చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల వెనుక మర్మ ఇదేననే ఊహాగానాలు కూడా ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. రాజధానిని అమరావతి నుంచి మరో ప్రాంతానికి మార్చబోమని ఏపీ మంత్రులు, ఇతర నేతలు క్లారిటీ ఇస్తున్నా... ఈ విషయంలో సీఎం జగన్ ఆలోచన ఏమిటి అనే అంశం అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

అయితే అమరావతి విషయంలో చంద్రబాబు, టీడీపీ నేతలకు షాక్ ఇచ్చే విధంగా సీఎం జగన్ నిర్ణయం ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే యోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం... దీన్ని కేవలం పరిపాలన అంశానికి మాత్రమే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అనేక ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను కేవలం అమరావతికి మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనకు సీఎం జగన్ విముఖంగా ఉన్నారని సమాచారం. అన్నీ అమరావతికే పరిమితం చేయకుండా రాయలసీమ, ఉత్తరాంధ్రలో సైతం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంతా హైదరాబాద్ పరిసరాలకు మాత్రమే పరిమితమైందని... ఈ కారణంగానే విభజన తరువాత ఏపీ నష్టపోయిందనే భావనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది. అమరావతి విషయంలో మళ్లీ ఇదే తప్పు జరగవద్దని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం... ఈ అంశాన్ని ముందుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉందని టాక్. ఇలా చేయడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడుతుందని వైసీపీ నమ్మకంతో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల టీడీపీకి కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఛాన్స్ ఉండదని వైసీపీ భావిస్తోంది.First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>