ఏపీలో కాలేజీలకు సీఎం జగన్ డెడ్‌లైన్...

రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో నాణ్యత మెరుగుపడుతున్నాయన్న సందేశం కచ్చితంగా వినిపించాలి. నియమాలు, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్న సంకేతం పోవాలని సీఎం జగన్ అన్నారు.

news18-telugu
Updated: November 28, 2019, 5:58 PM IST
ఏపీలో కాలేజీలకు సీఎం జగన్ డెడ్‌లైన్...
Video : ఏపీలో మూడు రాజధానులు.. జగన్ సంచలన ప్రకటన
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాలేజీలకు డెడ్‌లైన్ విధించారు. అన్ని కాలేజీలు నియమనిబంధనలు కచ్చితంగా అమలు చేయాని స్పష్టం చేశారు. ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌తో సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘లంచాలు ఇస్తే సరిపోతుందనే భావన కనిపించకూడదు. నిర్దేశించుకున్న ప్రమాణాలను కాలేజీలే కచ్చితంగా పాటించాలి. పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి అవసరమైతే 6 నెలల సమయం ఇవ్వండి. ఆతర్వాత వాటిపై చర్యలు తప్పనిసరి అని సందేశం రావాలి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల్లో నాణ్యత మెరుగుపడుతున్నాయన్న సందేశం కచ్చితంగా వినిపించాలి. నియమాలు, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్న సంకేతం పోవాలి. ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో కాలేజీలకు
ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అధికారులకు స్పష్టంచేశాను. ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిందంతా చేద్దాం.’ అని అన్నారు.

కాలేజీల్లో పరిస్థితులను కమిషన్‌ సభ్యులు ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం క్వాలిఫైడ్‌ టీచింగ్‌ స్టాఫ్‌ లేరు. లేబొరొటరీలో పరికరాలు సరిగ్గా లేవు.

టీచర్లు, స్టూడెంట్స్‌ హాజరు రిజిస్టర్‌లు సరిగ్గా లేవు. ఫైనాన్సెస్, జీతాల చెల్లింపులకు సంబంధించి రికార్డులు కూడా సక్రమంగా లేవు. చాలా కాలేజీల్లో అడ్మిష్లు కూడా చాలా స్వల్పంగా ఉన్నాయి. అని కమిషన్ సభ్యులు సీఎం జగన్‌కు తెలిపారు.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>