
'సీఎం జగన్, కేశినేని నాని
సీఎం జగన్ ఇంత పిరికివాడని తాను అనుకోలేదని నాని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు అందిస్తే 28 మంది ఎమ్మెల్సీలకు భయపడి పారిపోతావనుకోలేదంటూ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేనినాని ట్వీట్ చేశారు. ‘జగన్ అన్నా నువ్వూ నీ ముఠా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరు. హైకోర్టు ను అమరావతి నుండి మార్చలేరు. శాసనమండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదు. మీ వల్ల ఏదీ కాదు.’ అని ట్వీట్ చేశారు. దీనితోపాటు ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని ఆయన తన ట్వీట్లో పొందుపరిచారు. దేశంలో శాసనమండళ్లు ఏర్పాటు చేయడం లేదా రద్దు చేయడం అనే అంశాలపై ఓ జాతీయ విధానం ఉండాలంటూ గతంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు తమ ఇష్టానుసారంగా మండళ్లను రద్దు చేసుకుంటూ పోవడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడింది. రాజస్థాన్లో శాసనమండలి ఏర్పాటుకు ఆ కమిటీ ఓకే చెప్పింది. 2013 డిసెంబర్ 13న ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన ఆ కథనం ప్రకారం.. 1986లో తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనమండలి కౌన్సిల్ను రద్దు చేశారు. అయితే, ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్లో కూడా 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేశారు. ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మండలిని పునరుద్ధరించారు. రెండుసార్లు కేంద్రం ఆమోదంతోనే జరిగింది.
మరోవైపు సీఎం జగన్ ఇంత పిరికివాడని తాను అనుకోలేదని నాని అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు అందిస్తే 28 మంది ఎమ్మెల్సీలకు భయపడి పారిపోతావనుకోలేదంటూ ఎద్దేవా చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 28, 2020, 05:34 IST