ప్రశాంత్ కిషోర్‌కు... జగన్ ఎంత ఇచ్చారో తెలుసా ?

ఇక పార్టీ పోస్టర్లు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, తోరణాలు, కటౌట్లు, హోర్డింగ్‌లు, జెండాలు మొదలైన ప్రచార సామగ్రి కోసం మరో 1.03 కోట్లు (1,03,21,544) ఖర్చు చేశామంది.

news18-telugu
Updated: November 17, 2019, 11:49 AM IST
ప్రశాంత్ కిషోర్‌కు... జగన్ ఎంత ఇచ్చారో తెలుసా ?
ప్రశాంత్ కిశోర్‌తో జగన్
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మెజార్టీ గెలుపుతో ప్రశాంత్ కిషోర్ పేరు మారు మోగిపోయింది. అతడ్ని ఎన్నికల వ్యూహకర్తగా జగన్ నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సలహాలను, సూచనల్ని తూచ తప్పకుండా పాటించి జగన్ సక్సెస్ అయ్యారు. అంచనాకు మించిన సీట్లను సాధించారు. ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికలోనూ ప్రశాంత్ కిషోర్ టీం సలహాలనే జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం మూడు దఫాలు సర్వేలు చేసి మరీ ఇచ్చిన నివేదికను జగన్ అలక్ష్యం చేయలేదు. అందుకే గత ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీకి దక్కాయనడంలో అతిశయోక్తి లేదు.

అయితే తాజాగా పీకే టీమ్‌కు జగన్ ఎంత మొత్తాన్ని ఇచ్చారన్న అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. తాజాగా తమ ఎన్నికల ఖర్చుకు సంబంధించిన నివేదికను వైసీపీ బయటపెట్టింది. ఇందులో ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పొలిటికల్ కన్సల్టెన్సీ... అయిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (i-pac) కు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైయస్ఆర్సిపి రూ 37.57 కోట్లు (37,57,68,966) చెల్లించింది. వైఎస్‌ఆర్‌సిపి దాఖలు చేసిన 'ఎన్నికల వ్యయ ప్రకటన'లో ఎన్నికల ప్రకటన తేదీ సమయానికి తమ పార్కి బ్యాంక్ బ్యాలెన్స్ రూ. .74,32,449 (74 లక్షలు) ఉందని తెలిపింది.

ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పార్టీకి విరాళాల రూపంలో రూ. 221 కోట్ల రూపాయలు (221,58,52,225) సమకూరాయని పేర్కొంది.ఈ మొత్తంలో రూ .85 కోట్లు (85,65,18,694), స్టార్ క్యాంపెయినర్లకు రూ .9.72 కోట్లు (9,72,21,777), మీడియాలో ప్రకటనల కోసం రూ .36 కోట్లు (36,44,34,267) ఉన్నాయని తెలిపింది. ప్రకటనల కోసం ఖర్చు చేసిన డబ్బులో దాదాపు రూ. 24 కోట్ల రూపాయలు (24,67,34,007) జగన్ కటుుంబం నిర్వహిస్తున్న జగతి పబ్లికేషన్స్‌కు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇక పార్టీ పోస్టర్లు, బ్యానర్లు, బ్యాడ్జీలు, స్టిక్కర్లు, తోరణాలు, కటౌట్లు, హోర్డింగ్‌లు, జెండాలు మొదలైన ప్రచార సామగ్రి కోసం మరో 1.03 కోట్లు (1,03,21,544) ఖర్చు చేశామంది. అవన్నీ అయిపోగా రూ. 138 కోట్ల రూపాయల (138,58,28,365) బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని వైసీపీ తన ఖర్చు నివేదికలో తెలిపింది. గత నెలలో ఎన్నికల సంఘానికి కూడా దాఖలు చేసిన తన '2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికలో విరాళాల ద్వారా మొత్తం రూ .181 కోట్లు (181,07,92,658) అందుకున్నట్లు వైసీపీ తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా సుమారు రూ. 99 కోట్ల రూపాయలు (99,84,00,000) వచ్చాయని పేర్కొంది.

దీంతో పాటు కార్పొరేట్యేతర సంస్థల నుండి విరాళంగా రూ. 36.08 కోట్లు (36,08,18,258) అందుకున్నట్లు వైసీపీ నివేదికలో తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 11.7 కోట్ల రూపాయలు (11,70,46,137) ఉందని చెప్పింది.కార్పొరేట్ సంస్థలు గత ఏడాది రూ.2.53 కోట్లతో (2,53,00,000) ఇస్తే... ఈ ఏడాది మాత్రం రూ .18 కోట్లు (18,15,74,400) విరాళంగా ఇచ్చాయని పేర్కొంది.
First published: November 17, 2019, 11:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading