• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP CM JAGAN VISKHAPATNAM TOUR TOMORROW MEETING TO STEEL PLAN EMPLOYEES JAC NGS

Viskha steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో జగన్?.. రేపు ఉద్యోగుల జేఏసీతో సమావేశం

Viskha steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో జగన్?.. రేపు ఉద్యోగుల జేఏసీతో సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

విశాఖ ఉక్కు ఉద్యమంలో వైసీపీ కూడా దూకుడు పెంచుతోంది. దీంట్లో భాగంగా రేపు ఉద్యోగుల జేఏసీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. అటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. జీవీఎంసీ ఎన్నికల ముందు ఉక్కు ఉద్యమాన్ని అలా వదిలేస్తే ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

  • Share this:
    జీవీఎంసీ ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సెగలు రేపుతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో తమ పట్టు కోల్పోకూడదని ప్రయత్నిస్తున్నాయి. మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి పెద్దగా ఆలోచించని అధికార వైసీపీ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. సీఎం జగన్ నేరుగా రేపు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీతో భేటీ కానున్నారు.  ఈ భేటీలో ఏం చర్చిస్తారన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెంచుతోంది.

    రేపు ఉదయం విశాఖ పర్యటనకు సీఎం జగన్ వస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్.. ముందుగా శారదాపీఠానికి చేరుకుంటారు. . అక్కడ శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొంటారు.. తరువాత నేరుగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జేఏసీని కలుస్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల భాటలో నడిపించాలి అంటే ఏం చేయాలి..? ఉద్యోగులు ఏమనుకుంటున్నారు?  కేంద్రం ముందు ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలి తదితర అంశాలపై సీఎం జగన్ ఆరా తీస్తారు.

    శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొనాలన్నది ముందునుంచి ఉన్న షెడ్యూల్ అయినా.. అనుకోకుండా ఆయన స్టీల్ ఉద్యోగుల జేఏసీని కలవడం వెనుక వేరే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పట్టించుకోకపోతే రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని నివేదికలు అందినట్టు తెలుస్తోంది. దానికి తోడు విశాఖ ఉద్యమంలో టీడీపీ ఇప్పటికే దూసుకుపోతోంది. ఆ పార్టీ నేత పల్లా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షను భగ్నం చేయాల్సి వచ్చింది. మొన్న టీడీజీ జాతీయ కార్యదర్శి లోకేష్, ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వచ్చి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.

    విశాఖను మూడు రాజధానులు చేయాలని నిర్ణయించడంతో లోకల్ గా వైసీపీకి కాస్త అడ్వాంటేజ్ అయ్యింది. కానీ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమైతే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఈ ప్రభావం జీవీఎంసీ ఎన్నికలపై పడుతుంది. అందకే  వైసీపీ కూడా ఉక్కు ఉద్యమంలో దూకుడు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అందుకే పాదయాత్రకు సిద్ధమయ్యారు.. జీవీఎంసీ గేటు దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ గేట్ వరకు ఆయన ఈ పాదయాత్ర చేపట్టనున్నారు.. నగరమంతా కలిపేలా రోడ్ మ్యాప్ తాయరుచేశారు కూడా.. మొత్తం 23 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది..  ఇటు ఉద్యోగులు జేఏసీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.  ఇలా స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో దూకుడుగా ఉండేలా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. అప్పటికే కేంద్రం నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోతే ఏం చేయాలన్నదానిపైనా వైసీపీ నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: