రేపు సీమలో కియ మోటర్స్ ప్లాంట్ ప్రారంభించనున్న జగన్

అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా టెస్టు ట్రయల్ చేసిని ప్రారంభించారు.

news18-telugu
Updated: December 4, 2019, 10:31 AM IST
రేపు సీమలో కియ మోటర్స్ ప్లాంట్ ప్రారంభించనున్న జగన్
కియా మోటార్స్, సీఎం జగన్
  • Share this:
గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం జగన్. అక్కడ స్థాపించిన కియ మోటార్స్‌ ప్లాంటును ఆయన ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా టెస్టు ట్రయల్ చేసిని ప్రారంభించారు.  దీంతో ఉత్పత్తి పూర్తి స్థాయిలో మొదలు కాక ముందే ఈ ప్లాంటును ప్రారంభించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు టెస్ట్‌ ట్రయల్‌ చేశారని, ఇప్పుడు పూర్తిగా ప్లాంటు నిర్మాణం పూర్తయిందని అధికారులు చెప్తున్నారు.

ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన కార్లు ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్నాయి. కంపెనీ వినతి మేరకు జగన్‌ ఈనెల ఐదో తేదీన దీనిని ప్రారంభించడానికి వెళ్లనున్నారు. గురువారం నాడు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో కియ ప్లాంటుకు వెళ్తారు. అక్కడ కియ మోటర్స్ ప్లాంట్ ప్రారంభిస్తారు.


First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు