అధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశం... ఇక పాలనలో పరుగులే...

Andhra Pradesh : సంచలన నిర్ణయాలతో అందర్నీ ఆలోచింపజేస్తున్న సీఎం జగన్ కలెక్టర్లు, ఐపీఎస్‌లతో రెండ్రోజుల సమావేశాల్లో భాగంగా తొలిరోజు సమావేశమయ్యారు. నవరత్నాలు, బడ్జెట్‌పై చర్చిస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 10:18 AM IST
అధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశం... ఇక పాలనలో పరుగులే...
కలెక్టర్లతో జగన్ సమావేశం
  • Share this:
తనకు విధేయులుగా ఉన్నవారిని ఉన్నత స్థానాల్లో నియమించిన జగన్... రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి, చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, జిల్లాల్లో ప్రాధాన్యాలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 10గంటలకు ఉండవల్లి ప్రజావేదికలో ఈ సమావేశం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ ఇది కొనసాగనుంది. 25న కూడా మరో సమావేశం జరగనుంది. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అవసరమైన సమాచారాన్ని అధికారుల నుంచీ తీసుకొని... బడ్జెట్ కేటాయింపులు చేయబోతున్నారు జగన్. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి, చేపట్టే అంశాలపై నేటి సమావేశంలో చర్చిస్తున్నారు.

జగన్ సీఎం అయ్యి ఆదివారంతో నెల పూర్తైంది. ఆరు నెలల్లో మంచి సీఎంగా గుర్తింపు పొందుతానన్న ఆయనకు మిగిలింది ఐదు నెలలే. మొదటి నెలలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాలు, నామినేటెడ్ పదవుల పంపకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకి నిధులు వంటి అంశాల్ని పరిశీలించారు.

ఇవాళ్టి సమావేశంలో ఇసుక మాఫియా అంతు చూసేందుకు ఏం చెయ్యాలో చర్చిస్తున్నారు. అలాగే మద్యంపై మెల్లమెల్లగా నిషేధం విధించడం ఎలా అన్నదానిపై మాట్లాడుతున్నారు. మైనింగ్ పాలసీ, ఎర్రచందనం అమ్మకం, పోలవరం ప్రాజెక్ట్ అన్నీ చర్చిస్తారు. ఆగస్టు 15 నుంచి గ్రామ వాలంటీర్లను తెస్తున్న జగన్... అక్టోబర్ 2 నుంచీ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. దీని పైనా చర్చిస్తున్నారు.

చర్చించే అంశాలు : పాఠశాల విద్య, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, పాలనలో పారదర్శకత, ఆరోగ్యశ్రీ, 104, 108 సేవలు, పౌర సరఫరాల డోర్ డెలివరీ, కరవు పరిస్థితులు, వ్యవసాయం, పశుపోషణ రంగాలు, పశుగ్రాసం, మంచినీరు, కరెంటు, పేదలకు ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణం.మంగళవారం చర్చించే అంశాలు : శాంతి భద్రతలు
First published: June 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>