ఇక ప్రజల్లోకి ఏపీ సీఎం జగన్... ప్లాన్ ఇదీ... అధికారులకు టెన్షన్...

Andhra Pradesh : ఎంతసేపూ మంత్రులతోనే ఉంటే... ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి? అనుకుంటున్న వైసీపీ అధినేత, సీఎం జగన్... ప్రజల్లోకి వెళ్లాలని డిసైడయ్యారు. పక్కా ప్లాన్ వేసుకున్నారు.

news18-telugu
Updated: January 25, 2020, 6:29 AM IST
ఇక ప్రజల్లోకి ఏపీ సీఎం జగన్... ప్లాన్ ఇదీ... అధికారులకు టెన్షన్...
ఇక ప్రజల్లోకి ఏపీ సీఎం జగన్... ప్లాన్ ఇదీ... అధికారులకు టెన్షన్...
  • Share this:
ఏపీ సీఎం జగన్ చేసిన ఓ ప్రకటన అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఏంటంటే... ఫిబ్రవరి 1 నుంచీ తాను ప్రజల్లోకి వెళ్తాననీ, పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుంటానని అన్నారు. అలా అంటూనే మరో కీలక ప్రకటన చేశారు. ఏంటంటే... రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ఉగాది నాటికి ఈ కార్యక్రమం పూర్తవ్వాలన్నారు. అమ్మఒడి తర్వాత ఇదే అతి పెద్ద ప్రభుత్వ కార్యక్రమం అవుతుందన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు చెప్పిన విషయాల్ని లెక్కలోకి తీసుకొని ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం చెప్పడంతో... ఇప్పుడు అధికారులంతా ఆ పనిలో నిమగ్నమయ్యారు. అలాగే... ఫిబ్రవరి 1న సీఎం క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఎలాంటి ఫిర్యాదులూ రాకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో అంతా చేస్తూ... అధికారులు పరుగులు పెడుతున్నారు. ఇళ్ల పట్టాలు ఎవరికి ఇవ్వాలి? అర్హులు ఎవరు అన్న విషయాల్ని అధికారులు ఇప్పుడు... గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే బోర్డుల్లో పెట్టనున్నారు. ఎవరైనా అర్హులకు ఆ బోర్డులో తమ పేరు కనిపించకపోతే... గ్రామ వాలంటీర్లను పిలిచి... వారికి విషయం చెప్పి... అర్హుల జాబితాలో తమ పేరు ఉండేలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే అంశం గ్రామ వాలంటీర్లను అడిగితే చెబుతారు.

ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. అధికారులు ఫలానా స్థలాన్ని మీకు కేటాయిస్తున్నామని లబ్దిదారులకు చెప్పినప్పుడు... ఆ స్థలం నచ్చకపోయినా... లేక మరో ప్రాంతంలో స్థలం కావాలని లబ్దిదారులు కోరుకున్నా... ఆ విషయాన్ని అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు అధికారులు లబ్దిదారుల కోరినట్లుగా స్థలం కేటాయించేందుకు ప్రయత్నిస్తారు. ఇలా చెయ్యమని స్వయంగా సీఎం జగనే అధికారులకు సూచించారు.

మొత్తంగా చూస్తే... ఉగాది నాటికి ఇంటి స్థలం లేని వారు ఎవరూ ఉండకూడదన్నది సీఎం జగన్ ఆలోచన. ఇలా ఇళ్ల స్థలాలు కేటాయించాక... అక్కడ ఇళ్లు కూడా ప్రభుత్వమే కడుతుంది. అప్పటివరకూ లబ్దిదారులు వేరే ఇళ్లలో ఉంటారు. ఇళ్లు కట్టాక... ప్రభుత్వం ఆ ఇళ్లను లబ్దిదారులకు ఇస్తుంది. అప్పుడు అందులో ఎంటర్ అవుతారు. ఐతే... ఇళ్ల పట్టాలు ఇవ్వగానే... ఆ క్షణం నుంచే లబ్దిదారులు... అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. ఇల్లు పూర్తిగా కట్టేలోపు కూడా వెళ్లొచ్చు.

పై ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్... ఫిబ్రవరి 1 నుంచీ ప్రజల్లోకి వెళ్లి... అన్నీ తెలుసుకుంటానని అధికారులకు చెప్పారు. ఎప్పుడు ఏ పల్లెకు వెళ్తారో తెలియదు. ఆకస్మిక తనిఖీలా... ఒకే ఒక్కడు సినిమాలోలా... సడెన్‌గా వెళ్తారట. ఇది అధికారులకు షాక్ ఇచ్చే అభిప్రాయమే అనుకోవచ్చు. ఏదైనా పల్లెకు వెళ్లినప్పుడు... అక్కడి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారంటే చాలు సీఎం జగన్ చర్చలు తీసుకోవడం గ్యారెంటీ. పొరపాట్లు జరిగితే... కచ్చితంగా అధికారులనే బాధ్యుల్ని చేస్తానని ఆల్రెడీ ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. అందువల్లే ఇప్పుడు అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ అధికారులు... రోజూ ఎన్నో విధులు నిర్వహిస్తూనే ఉన్నా... ప్రజలన్నాక ఎన్నో డిమాండ్లు కోరతారు. అవన్నీ వెంటనే చెయ్యడం అధికారులకు కష్టమే. ఒకవేళ సీఎం ముందు తమ కోరికల చిట్టాను ప్రజలు ఉంచితే... అప్పుడు తాము బుక్కవుతామేమోనని అధికారులు టెన్షన్ పడుతున్నారు. 
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు