ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి... మహిళకు ఇవ్వాలని జగన్ నిర్ణయం ?

ఈ పదవికి సంబంధించి ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో జగన్ ఎవరికి ఓటు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: January 13, 2020, 3:02 PM IST
ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి... మహిళకు ఇవ్వాలని జగన్ నిర్ణయం ?
న్యూస్ యాంకర్ స్వప్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ (File Photo)
  • Share this:
పృ‌థ్విరాజ్ రాజీనామాతో... ఎస్వీబీసీ కొత్త చైర్మన్‌గా ఎవర్ని నియమించలన్న అంశం పట్ల ఇంకా స్పష్టత రావడం లేదు. ఓ వైపు సినిమా డైరెక్టర్, వైఎస్ఆర్‌కు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తున్నా... జగన్ మాత్రం ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి మహిళకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ జర్నలిస్ట్ స్వప్న పేరును ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఎస్వీబీసీ డైరెక్టర్‌గా ఉన్న స్వప్న గతంలో సాక్షి టీవీకి ఫేస్ ఆఫ్ ద ఛానెల్ గా ఉన్న విషయం తెలిసిందే.

వైఎస్సార్సీపీ పార్టీ విజయంలో స్వప్న కూడా జర్నలిస్ట్ గా ప్రముఖ పాత్ర పోషించారు.అందుకే ప్రస్తుతం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్న ఆమెను సీఎం జగన్  ఎస్వీబీసీ డైరెక్టర్‌గా అవకాశం కల్పించారు. సంగీతం, సాహిత్యంతో పాటు వివిధ భాషలపై పట్టు ఉన్న స్వప్న ఆధ్వర్యంలో ఎస్వీబీసీ మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎస్వి బీసీ చైర్మైన్ గా ఓ సీనియర్ పాత్రికేయురాలు ఓ మహిళ కు అవకాశం ఇవ్వనున్నన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే ఈ పదవికి సంబంధించి ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో జగన్ ఎవరికి ఓటు వేస్తారన్నది వేచి చూడాలి.సిని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డికి కూడా జగన్ ఇప్పటికే ఎస్వీబీసీ డైరెక్టర్‌గా నియమించారు.

ఆడియో టేపుల వ్యవహారంపై దుమారం రేగడంతో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఆయన ఆదివారం సాయంత్రం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

First published: January 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు