ఏపీకి ప్రత్యేక హోదాయే సంజీవని...నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్

ఏపీ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్నిజగన్. ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే కొంత వరకు పూడ్చగలదని తెలిపారు.

news18-telugu
Updated: June 15, 2019, 6:38 PM IST
ఏపీకి ప్రత్యేక హోదాయే సంజీవని...నీతి ఆయోగ్‌  సమావేశంలో సీఎం జగన్
సీఎం వైఎస్ జగన్
news18-telugu
Updated: June 15, 2019, 6:38 PM IST
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీని ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలన్నారు సీఎం జగన్. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని...ఆ నష్టాన్ని పూడ్చాలంటే హోదా రావాల్సిందేనని స్పష్టంచేశారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి జగన్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గళాన్ని బలంగా వినిపించారు. ఏపీ ఆర్థిక స్థితిగతులతో పాటు రెవెన్యూ లోటు భర్తీ, ప్రత్యేక హోదా ఆవశ్యకతకు సంబంధించి నివేదిక సమర్పించారు జగన్. అంతేకాదు ఏపీకి ప్రత్యే​క హోదా ఇస్తూ గత కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని అందజేశారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నీతి ఆయోగ్ పాలకమండలికి విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం.

విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. గత ప్రభుత్వం అవినీతి వలన ఏపీలో నిరుద్యోగం పెరిగింది. పెట్టుబడులు రాకపోవడంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేక హోదా మాత్రమే ఏపీకి జీవన రేఖ. 14వ ఆర్థిక సంఘం సూచనతోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోరనే ప్రచారం జరుగుతోంది. హోదా రద్దుకు తాము సిఫారసు చేయలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ఒకరు పేర్కొన్నారు. అభిజిత్‌ సేన్‌ రాసిన లేఖను కూడా మీకు అందిస్తున్నా.
వైఎస్ జగన్[/name
]

'' విభజన సమయంలో 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతమే ఆస్తులు పంచారు. ఎక్కువ ఆదాయం ఇచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోవడంతో ఏపీకి నష్టం జరిగింది. ఐటీ సెక్టార్ హైదరాబాద్‌లో ఉండడంతో ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. 2015-16లో తెలంగాణ తలసరి ఆదాయం 14,414 కాగా, ఏపీ తలసరి ఆదాయం 8,397 మాత్రమే. ఆ నష్టాన్ని పూడ్చేందుకే అప్పటి ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది.'' అని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97వేల కోట్ల అప్పులున్నాయి. 2018-19 నాటికి ఏపీ అప్పులు రూ.2.58 లక్షల కోట్లకు చేరాయి. ఏడాదికి రూ. 20వేల కోట్లు వడ్డీ, 20వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. చేతి వృత్తులు, ఉపాధి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మౌలిక రంగాల్లో పెట్టుబడుల కొరత ఎక్కువగా ఉంది. విద్యా, వైద్య రంగాలు పతనావస్థకు చేరుకున్నాయి. ఉపాధి అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస పోతుతున్నారు.
వైఎస్ జగన్
ఏపీ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చాలని నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్రాన్నిజగన్. ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే కొంత వరకు పూడ్చగలదని తెలిపారు. హోదా ఇస్తే రాష్ట్రానికి పెట్టుబడులు, మౌలిక వసతులు సమకూరుతాయని స్పష్టంచేశారు.
First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...