ఫలించిన ఏపీ సీఎం జగన్ వ్యూహం... షాక్ అవుతున్న టీఆర్ఎస్‌

Andhra Pradesh : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోల్చితే... జగన్ రాజకీయ అనుభవం చాలా తక్కువ. అలాంటిది ఆయన వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలతో టీఆర్ఎస్ చిక్కుల్లో పడుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 9:35 AM IST
ఫలించిన ఏపీ సీఎం జగన్ వ్యూహం... షాక్ అవుతున్న టీఆర్ఎస్‌
వైఎస్ జగన్, కేసీఆర్
Krishna Kumar N | news18-telugu
Updated: October 5, 2019, 9:35 AM IST
Andhra Pradesh : ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. ఇది ఎన్నో ఏళ్లుగా ఉన్నదే. ఏటా నష్టాల్ని భర్తు చేసేందుకు ప్రభుత్వాలే వందల కోట్లను ఆర్టీసీకి ఇస్తున్న పరిస్థితి. ఇదంతా చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్... తమ పార్టీ అధికారంలోకి వస్తే... ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేస్తానన్నారు. అన్నట్లుగానే అధికారంలోకి రాగానే... ఆర్టీసీని కాకుండా... ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేశారు. దాంతో... ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్లూ పడిన కష్టాలు, సమస్యలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినట్లైంది. అందుకే దసరా పండుగనాడు... ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు నిజంగానే పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో... తెలంగాణలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏపీలోలాగానే తమనూ ప్రభుత్వంలో కలిపేయాలనే ప్రధాన డిమాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగిన పరిస్థితి తలెత్తింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నా... సీఎం కేసీఆర్... వేర్వేరు కారణాల వల్ల అలాంటి నిర్ణయానికి ఒప్పుకోవట్లేదు. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఎందుకు అలా ఒప్పుకోరంటూ పట్టుపడుతున్నారు. ఇప్పుడు దీనికి ఒప్పుకుంటే... రేపు తెలంగాణలో ఆటోడ్రైవర్లు, కార్ డ్రైవర్లు కూడా... ఏపీ సీఎం అక్కడి ఆటోడ్రైవర్లు, కారు డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేలు ఇస్తున్నట్లుగానే... తమకూ ఇవ్వాలని డిమాండ్ చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో తీసుకునే నిర్ణయాల వంటివి తెలంగాణలో తీసుకోకూడదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.

నిజానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పోల్చితే... జగన్ రాజకీయ అనుభవం చాలా తక్కువ. అలాంటిది ఆయన వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలతో తెలంగాణ ప్రభుత్వానికి చిక్కులు ఎదురవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందనీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రజల గురించి ఆలోచించట్లేదనే విమర్శలు చేస్తున్నారు కొందరు. ఆర్టీసీ విషయానికే వస్తే... మరో 10, 15 ఏళ్ల వరకూ ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెల జోలికి వెళ్లరు. ఒకవేళ వెళ్లినా... ప్రజలు ఉద్యోగులనే తిడతారు. ఎందుకంటే... ప్రభుత్వం వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించింది కాబట్టి... ఆర్టీసీ ఉద్యోగులకు అదే అతి పెద్ద వరం. అంతకంటే ఇంకేం కావాలి అని ప్రజలంటున్నారు. అందువల్ల ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ఇక సమ్మెల మాట ఎత్తరు. అదే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ ఒకవేళ ఒప్పుకుంటే... ఆ క్రెడిట్... కేసీఆర్‌కి కాకుండా... జగన్‌కి వెళ్లే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇలా... జగన్ కావాలని చెయ్యకపోయినా... ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వానికి షాకులిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...