జగన్ రిటర్న్ గిఫ్ట్...ఎవరికో చెప్పిన టీడీపీ నేత

ఎన్నికలకు ముందు ఏపీకి సీఎస్‌గా వచ్చిన ఎల్వీ సుబ్రహ్మణ్యం టీడీపీ ఓడిపోవాలని కోరుకున్నారని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

news18-telugu
Updated: November 14, 2019, 4:33 PM IST
జగన్ రిటర్న్ గిఫ్ట్...ఎవరికో చెప్పిన టీడీపీ నేత
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణం బదిలీ అంశంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయవాడలో జరుగుతున్న చంద్రబాబు ఇసుక దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న సోమిరెడ్డి... రాష్ట్రంలో పరిపాలన అంతా అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. తాను అనుకున్నదే జరిగాలనే విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఏరికోరి తెచ్చుకున్న మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కూడా జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

ఎన్నికలకు ముందు ఏపీకి సీఎస్‌గా వచ్చిన ఎల్వీ సుబ్రహ్మణ్యం టీడీపీ ఓడిపోవాలని కోరుకున్నారని అన్నారు. నీరు చెట్టు, రైతు రుణమాఫీకి నిధులు విడుదల చేయాలని నాటి సీఎం చంద్రబాబు చెప్పినా... తెరవెనుక జగన్ ఆదేశాల కారణంగా ఆయన దానికి అడ్డుపడ్డారని సోమిరెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు అదే ఎల్వీ సుబ్రహ్మణ్యంను జగన్ తప్పించారని... ఆయన కారణంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని అన్నారు.






First published: November 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...