చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారు చేసిన జగన్ ?

జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండో నెలలో చిరంజీవి విశాఖ పరిసర ప్రాంతాల్లో 650 ఎకరాలు భూమి కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: January 8, 2020, 12:32 PM IST
చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారు చేసిన జగన్ ?
చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ
  • Share this:
మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఖరారైందా ? ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో్ ఇదే హాట్ టాపిక్‌. త్వరలో ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా వైసీపికే దక్కనున్నాయి. అందులో ఒకటి చిరంజీవికి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి కాపుల ఓట్లు చీల్చేందుకు చిరంజీవిని టార్గెట్ చేసి... రాజ్యసభకు పంపాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారంజ ఇందుకు చిరంజీవి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. గత నెల సైరా రిలీజ్ అయ్యాక చిరంజీవి సీఎం జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో రాజకీయల చర్చలు జరిగాయి. అప్పుడే జగన్ చిరంజీవి ముందు రాజ్యసభ సీటు ఇచ్చే ప్రపోజల్ పెట్టారట. ఇందుకు చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించారు.

అందుకే రాజధానిని మూడు ముక్కలు చేసినా చిరంజీవి జగన్ కు మద్దతు పలికారు. రాజ్యసభ సీటు వదులు కోవడానికి మాత్రం చిరంజీవి సిద్దంగా లేరు. అంతే కాదు జగన్ ప్రభుత్వం ఏర్పడిన రెండో నెలలో చిరంజీవి విశాఖ పరిసర ప్రాంతాల్లో 650 ఎకరాలు భూమి కూడా కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే రాజధాని విశాఖకు తరలిపోనుందని చిరంజీవికి ఎవరు చెప్పారో కూడా మనకు అర్థమైనట్లే. కాపు ఓట్లలో చిరంజీవి రాష్ట్రం మొత్తం మీద కనీసం 10 లక్షలైనా తీసుకు రాపోతారా అనే జగన్ చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
మోహన్ బాబు మోదీ భేటీ వెనుక కూడా ఇదే రాజకీయ కారణం కూడా ఉందని వార్తలు వినిపించాయి. చిరు రాజ్యసభ సీటు విషయంపై కూడా మోహన్ బాబు మోదీతో చర్చించారని వార్తలు వినిపించాయి.

అయితే ఇప్పటికే వైసీపీలో చేరిన మోహన్ బాబుకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు. పైగా మోహన్ బాబు జగన్‌కు బంధువు కూడా కావడంతో మోహన్ బాబు కూడా తనకు రాజ్యసభ పదవి దక్కుతుందన్న అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సమంయంలో చిరు రాజ్యసభ సీటు కోసం మోహన్ బాబు ఎందుకు మోదీని కలుస్తారన్న వాదన కూడా లేకపోలేదు. ఏదీ ఏమైనా... ఓవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో అమరావతి రాజధాని కోసం పోరాడుతుంటే చిరంజీవి మూడు రాజధానులకే మొగ్గు చూపడంపై కొందరు కాపు నేతలు బహిరంగానే చిరంజీవిని విమర్శించారు. అయితే చిరంజీవి మాత్రం అవేం పట్టించుకోకుండా మూడో సారి ముచ్చటగా మరో పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

First published: January 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు