Viskha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై రెండు రోజుల్లో అనుకూల ప్రకటన: పోస్కో ప్రతినిధులు కలిసిన మాట వాస్తమే-జగన్

Viskha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పై రెండు రోజుల్లో అనుకూల ప్రకటన: పోస్కో ప్రతినిధులు కలిసిన మాట వాస్తమే-జగన్

ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తమే అన్నారు.

ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తమే అన్నారు.

  • Share this:
    ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు.. తొలిసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడిన ఆయన.. తనను పోస్కో ప్రతినిధులు కలిసిన మాట వాస్తమే అన్నారు. అయితే వారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదన్నారు. తనిను కలిసిన పోస్కో ప్రతినిధులతో కడప, భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల దగ్గర స్టీల్‌ప్లాంట్ పెట్టమన్నాని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ప్లాంటు ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తానని హామీ ఇచ్చాను అన్నారు.

    ప్రస్తుతం విశాఖలో ఉక్కు ఉద్యమం సెగలు రేపుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మారుమోగుతోంది.. అన్ని పార్టీలు ఉద్యమంలో భాగమవుతున్నాయి.. త్వరలో జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉక్కు ఉద్యమం కీలకమవుతుందని అంతా భావిస్తున్నారు. అందుకే అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ స్టీల్ ప్లాంట్ పైనే ఉంది. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ సీఎం జగన్ ను టార్గెట్ చేశాయి. జగన్ కు తెలిసే అంతా జరుగుతోందని.. గతంలో పోస్కో ప్రతినిధులు కూడా జగన్ ను కలిశారని విమర్శలు చేస్తున్నారు.. గతంలో రాజ్యసభ వేధికగా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అప్పటి నుంచి సీఎంకు తెలిసే ప్రైవేటీకరణ జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.. మంగళవారం విశాఖలో పర్యటించిన చంద్రబాబు సైతం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. పోస్కో ప్రతినిధులు వచ్చి కలిస్తే.. ఇంతకాలం జగన్ ఏం చేస్తున్నారు? పబ్జీ ఆడుతున్నారా..? నిద్ర పోతున్నారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు..

    సాధరణంగా విపక్షాలు విమర్శించినా మంత్రులు సమాధానం చెబుతారు తప్పా.. సీఎం జగన్ ఎప్పుడు నేరుగా వాటిపై స్పందించింది లేదు. కానీ తొలిసారి తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు జగన్. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో భేటీ తరువాత.. మాట్లాడిన జగన్.. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమే అన్నారు. అయితే ఆ భేటీలో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమని సూచించాను అన్నారు. కుదరకపోతే భావనపాడు, కృష్ణపట్నం పోర్టుల దగ్గర స్టీల్‌ప్లాంట్ పెట్టమన్నామని పేర్కొన్నారు. ప్లాంటు ఏర్పాటు చేస్తే పోస్కోకు సహకరిస్తామన్నారు.

    అలాగే దేవుడి ఆశీస్సులతో స్టీల్‌ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దీనిపై నరేంద్ర మోదీకి లేఖ రాసి పది రోజులు దాటినా ఇప్పటి వరకు సమాధానం రాలేదు అన్నారు. రెండు మూడు రోజుల్లో మనకు అనుకూల ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని జగన్‌ ప్రకటించారు. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఉద్యమించాలని కోరారు

    ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తమే అని చెప్పారు. రెండు మూడు రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా.. మనకు అనూకలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు