ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... కొత్త పథకం ప్రారంభించనున్న సీఎం జగన్

బ్యాంకు రుణాల ద్వారా యువతకు వాహనాలు మంజూరు చేయనుంది. అయితే ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఏడుగురు సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు.

news18-telugu
Updated: October 22, 2019, 5:05 PM IST
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త... కొత్త పథకం ప్రారంభించనున్న సీఎం జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి
news18-telugu
Updated: October 22, 2019, 5:05 PM IST
ఏపీలో నిరుద్యోగులకు మరో పథకం ప్రవేశపెట్టారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి . నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో... వైయస్సార్ ఆదర్శం అనే పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం. ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కార్పొరేషన్ ల ద్వారా నిరుద్యోగులందరికి వైయస్సార్ ఆదర్శం పథకం ద్వారా నిరుద్యోగులకు వాహనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. బ్యాంకు రుణాల ద్వారా యువతకు వాహనాలు మంజూరు చేయనుంది. అయితే ఇప్పటికే కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలో ఏడుగురు సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆయా జిల్లాల్లో పర్యటించిన వివరాలు సేకరించి నివేదికను అందజేయనున్నారు. సీఎం జగన్ తాజా నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ప్రవేశ పెట్టిన జగన్ అందులో ఒక్కొక్కటిని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఏపీలో అనేక సంక్షేమ పథకాల్ని సీఎం ప్రారంభించారు. తాజాగా రైతులకు రైతు భరోసా పేరుతో పథకానికి శ్రీకారం చుట్టారు. రైతు భరోసా పేరుతో రైతులకు అందిస్తున్న మొత్తాన్ని రూ.12500 నుంచి రూ.13500కు పెంచారు.దీంతో పాటు తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వం రిగ్గుల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.మొత్తంమీద ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీల్ని అమలు చేసుకుపోతున్నారు సీఎం జగన్.


First published: October 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...