గ్రామ వాలంటీర్ జీతం రూ.8000... సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ?

ప్రతీకాత్మక చిత్రం

. గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తూ ఉండి.. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైతే.. ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే విధుల్లో చేరిన గ్రామ వాలంటీర్లకు మరో శుభవార్త వినిపించే పనిలో పడ్డారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గ్రామ వలంటీర్ గౌరవ వేతనం రూ.5,000 నుండి రూ.8,000 పెంచాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ కీలక నిర్ణయంపై చర్చించేందుకు సీఎం ఇవాళ రాష్ట్ర గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ కానున్నారు. ఈ భేటీలో చర్చించిన తరువాత సీఎం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల కోసం జూన్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేశారు.

  తాజాగా జగన్ ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులకు సంబంధించి విద్యార్హతను తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి అక్టోబరు 1న అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు వాలంటీర్లుగా పనిచేస్తూ ఉండి.. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైతే.. ఏర్పడే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అవసరం అనుకుంటే వాలంటీర్ ఉద్యోగానికి సంబంధించి అర్హతలు తగ్గించే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఇంటర్మీడియట్ వాలంటీర్ ఉద్యోగాలకు అర్హతగా నిర్ణయిస్తే... మిగిలిన ఖాళీల్ని కూడా సులభంగా భర్తీ చేయవచ్చని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో వాలంటీరు పోస్టుల్లో ఖాళీ అనే మాటే వినిపించకూడదని అధికారులను ఆదేశించారు. అక్టోబరు 15 నాటికి ఎలా అయిన వాలంటీర్ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్.

  ఇవికూడా చదవండి:
  విశాఖలో బంగారం, కరెన్సీ నోట్లతో అమ్మవారు

  First published: