ఎస్వీబీసీ ఛైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజధాని రైతుల్ని ఉద్దేశించి పృథ్వీ మాట్లాడిన మాటలు సరికాదని జగన్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. సమస్యలపై మాట్లాడాలే తప్పా... కులాల ప్రస్తావన చేయడం సరికాదని ఆయనకు మొట్టికాయలు వేశారు జగన్. రైతులపై ఇష్టానుసారంగా మాట్లాడితే... అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కులాలను ప్రస్తావిస్తూ.. ఎవరినీ కించపరిచేలా మాట్లాడకూడదని సీఎం పృథ్వీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవలే పృథ్వీ మాట్లాడుతూ... అమరావతలో రైతులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎవరైనా ఆడీకార్లలో తిరుగుతారా ? బంగారు గాజులు వేసుకొని ధర్నాలు చేస్తారా అంటూ ఆయన విమర్శలు చేశారు. దీనిపై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. రైతులు అయితే కార్లు కొనుక్కోకూడదా? బంగారు గాజులు వేసుకోకూడదా అని ప్రశ్నించారు. రైతుల్ని పెయిడ్ ఆర్టిస్ట్‌లు అన్నందుకు పృథ్విరాజ్ సిగ్గుపడాలన్నారు. వెంటనే రాజధాని రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇలా సొంత పార్టీకి చెందిన నాయకులు ఇద్దరూ మధ్య మాటల యుద్ధం నెలకొనడంతో... ఈ విషయం కాస్త సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పృథ్వీ వైఖర్నీ తప్పు పట్టారు. మరోసారి ఇలా చేయోద్దని ఆదేశాలు కూడా ఇచ్చారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.