రింగ్ దాటితే బయటకే... టీడీపీ సభ్యులకు జగన్ సీరియస్ వార్నింగ్

సభలో కనీసం పట్టుమని 10 మంది సభ్యులు లేరుకానీ... చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

news18-telugu
Updated: January 22, 2020, 11:09 AM IST
రింగ్ దాటితే బయటకే... టీడీపీ సభ్యులకు జగన్ సీరియస్ వార్నింగ్
అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (
  • Share this:
టీడీపీ సభ్యులపై సీఎం జగన్ మండిపడ్డారు. సభను నడవకుండా టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. సభలో కనీసం పట్టుమని 10 మంది సభ్యులు లేరుకానీ... చెత్త రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మేం 151మంది ఉన్నా ఎంతో ఓపికా ఉన్నామన్నారు. వైసీపీ సభ్యుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు జగన్. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు అగౌరవపరుస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారన్నారు.ఇంతకంటే దిక్కుమాలిన పార్టీ, దిక్కుమాలిన సభ్యులు ఎక్కడ ఉండరన్నారు. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలో చేతకాకపోతే అసెంబ్లీకి రావొద్దన్నారు. ఎవరైనా పోడియం వద్దకు వస్తే... మార్షల్స్‌తోబయటకు ఈడ్చేస్తామన్నారు. పోడియం వద్ద మార్షల్స్‌ను పిలిపించి ఉంచాలన్నారు. ఎవరైనా రింగ్ దాటి లోపలికి వస్తే.. వెంటనే బయటకు పంపించేయండని స్పీకర్‌కు తెలిపారు సీఎం జగన్. దీంతో స్పీకర్ వెంటనే మార్షల్స్‌ను సభలోకి పిలిపించారు.

అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టీతో ముగియనున్నాయి. అయితే గత రెండురోజులుగా సభలో టీడీపీ సభ్యులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ నుంచి స్పీకర్ తమ్మినేని బయటకు వెళ్లిపోయారు.

First published: January 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు