కేంద్రంకు షాక్... ఎన్ఆర్సీపై జగన్ సంచలన నిర్ణయం

ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఎన్నాఆర్సీకి పూర్తిగా వ్యతిరేకమన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్... ఎన్ఆర్సీపై స్పందించారు. ఎన్ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు.

news18-telugu
Updated: December 23, 2019, 4:21 PM IST
కేంద్రంకు షాక్... ఎన్ఆర్సీపై జగన్ సంచలన నిర్ణయం
వైఎస్ జగన్
  • Share this:
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA), NRCపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎన్ఆర్సీకి వ్యతిరేకమన్నారు. పార్లమెంట్ లో బిల్లుకు సైతం ఆయన మద్దుతు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు CAAకు వ్యతిరేకంగా ఓటు వేశారు.ఈ నేపథ్యంలో ఎన్ఆర్సీపై ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం ఎన్నాఆర్సీకి పూర్తిగా వ్యతిరేకమన్నారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్... ఎన్ఆర్సీపై స్పందించారు. ఎన్ఆర్సీకి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వదన్నారు. మైనార్టీలకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు జగన్. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలు CAA, NRCకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలు సైతం కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకంగా గళమెత్తింది. ఇటు తమిళనాడు, కర్నాటకలో సైతం ప్రజలు పెద్త ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. కడప జిల్లాలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు నేడు ద్వారా మూడేళ్లో ఆస్పత్రుల రూపు రేఖాలు మారుస్తామన్నారు.


First published: December 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు