నా మతం అదే... ఆరోపణలపై స్పందించిన జగన్

గత కొద్ది రోజులుగా తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలను చూసి బాధ వేస్తుందోన్నారు సీఎం జగన్.

news18-telugu
Updated: December 2, 2019, 2:48 PM IST
నా మతం అదే...  ఆరోపణలపై స్పందించిన జగన్
ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
గుంటూరు జిల్లాలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. వైఎస్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలపై జగన్ స్పందించారు. గత కొద్ది రోజులుగా తన మతం, కులంపై వస్తున్న ఆరోపణలను చూసి బాధ వేస్తుందోన్నారు. ఎవరెన్నీ అవాకులు, చవాకులు పేలిన.. నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకొనే కులం అన్నారు సీఎం. దీంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. రాష్ట్రంలో పాలనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. మంచి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారన్నారు జగన్. తమ మేనిఫెస్టోనే బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించామన్నారు.

గుంటూరులో జగన్ ప్రారంభించిన కొత్త పథకం వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఆసరా పథకం కింద చికిత్స చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల సాయం అందించనుంది ఏపీ ప్రభుత్వం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో WHO స్టాండర్డ్స్ ఉన్న మెడిసన్స్ అందుబాటులో ఉంటాయన్నారు. జనవరి 1 నుంచి హెల్త్ కార్డులతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తామన్నారు.


First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>