టీడీపీకి గట్టి షాక్ ఇచ్చే పనిలో జగన్ ... ఆ నలుగురు మంత్రులతో ప్రత్యేక భేటీ

అసెంబ్లీ సమావేశాలకు ముందే జగన్ టీడీపీకి గట్టి షాక్ ఇచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 4:25 PM IST
టీడీపీకి గట్టి షాక్ ఇచ్చే పనిలో జగన్ ... ఆ నలుగురు మంత్రులతో ప్రత్యేక భేటీ
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు పవన్ బీజేపీకి అనుకూలంటా మాట్లాడుతుంటే... మరోవైపు టీడీపీ నేతలు వైసీపీలోకి వెళ్లేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి జగన్ చెంతకు చేరేందుకు సిద్దమవుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు వైసీపీలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై చర్చించేందుకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్  మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, బుగ్గనతో సమావేశమయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలో ఎమ్మెల్యేల వలసల విషయంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ  సమావేశాల్లోపు టీడీపీ నుంచి వైసీపీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు జోరందుకున్నాయి.

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడారు. యువనేత దేవినేని అవినాష్ కూడా వైసీపీలో చేరారు. దీంతో మరికొందరు టీడీపీ నేతల్ని కూడా వైసీపీలోకి జోరుగా చేరే అవకాశాలు కనపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో దీనపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు ప్రతిపక్ష పార్టీని గట్టిగా దెబ్బ కొట్టేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>