కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న జగన్ ఇవాళ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి షాతో సీఎం చర్చించటన్లు తెలుస్తోంది. మధ్యాహ్నం కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని జగన్ ... అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
అయితే సోమవారమే జగన్ .. అమిత్ షాను కలవాల్సి ఉండగా... పలు కారణాల వల్లే ఈ భేటీ మంగళవారానికి వాయిదా పడింది. జగన్‌కు షా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీంతో నిన్న రాత్రి ఢిల్లీలోని బస చేసిన జగన్.. ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో అమిత్ షాతో సమావేశమయ్యారు.
వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నమే సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకోవాల్సి ఉంది. అక్కడ అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్‌కు హాజరుకావాల్సి ఉంది. ఐతే సోమవారం కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఆ భేటీలన్నీ మంగళవారానికి వాయిదాపడ్డాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆలస్యమయ్యే అవకాశముంది. మరి మంగళవారమే సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలుదేరి ఏపీకి చేరుకుంటారా.. అన్నది తెలియాల్సి ఉంది.
ఇవికూడా చూడండి:
పాట పాడుతూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న పోలీస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.