జగన్ మాస్టర్ ప్లాన్... ఏపీ సీఎస్ బదిలీ వెనుక వ్యూహం ఇదే...

కావాలనే సీఎస్‌ను బదిలీ చేశారా ? సీఎస్ బదిలీ వెనుక జగన్ చాకచక్యంగా పావులు కదిపారా? ఎల్వీ బదిలీ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందా ? అంటే వీటిన్నంటికి అవుననే సమాధానం వస్తోంది.

news18-telugu
Updated: November 4, 2019, 6:23 PM IST
జగన్ మాస్టర్ ప్లాన్...  ఏపీ సీఎస్ బదిలీ వెనుక వ్యూహం ఇదే...
ఏపీ చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయడం సంచలనానికి దారి తీసింది. జగన్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తిగా పేరుపొందిన ఎల్వీని ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేయడంతో ఆయన లాంగ్ లీవ్ మీద వెళ్లారు.
  • Share this:
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీతో రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఉన్నట్టుండి సీఎస్‌ను జగన్ ఎందుకు బదిలీ చేశారు? అందుకు దారితీసిన కారణాలేంటి? కారణాలు వెతక్కున్నారా ? కావాలనే సీఎస్‌ను బదిలీ చేశారా ? సీఎస్ బదిలీ వెనుక జగన్ చాకచక్యంగా పావులు కదిపారా? ఎల్వీ బదిలీ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ వేరే ఉందా ? అంటే వీటిన్నంటికి అవుననే సమాధానం వస్తోంది.

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాస్త ముందుగానే ఏపీ సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది. దీనిపై అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాబు వ్యతిరేకించినట్లే... ఎల్వీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు మొదలయ్యాయి.  ఆయన అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే... వాస్తవానికి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో సత్సంబందాలున్నాయి. దీంతో బీజేపీ-వైసీపీ కలిసి తమని ఇబ్బంది పెడుతున్నాయని టీడీపీ ఆరోపించింది.

Chandrababu Naidu planning to make a cabinet meeting in ap, ఈనెల 10న ఏపీ కేబినెట్... అజెండాకు సీఎస్ గ్రిన్ సిగ్నల్ ఇస్తారా ?,chandrababu naidu,ap cm chandrababu,ap cabinet meeting,ap cabinet meeting,ap politics,ap news,ap election code,election commission,election code in ap,modi cabinet meeting,pm modi,narendra modi,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,సీఎం చంద్రబాబు నాయుడు,ఏపీలో కేబినెట్ భేటీ,ఏపీలో మంత్రివర్గ సమావేశం,సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం,ఏపీలో ఎన్నికల కోడ్,ఎలక్షన్ కమిషన్,ఎన్నికల కమిషన్,ఏపీలో కోడ్
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం చంద్రబాబునాయుడు


ఆ తర్వాత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అవ్వడంతో సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు. అయితే ఇప్పుడు ఐదు నెలల తరువాత ఎల్వీని సీఎస్ గా తప్పించారు. అయితే దీనివెనుక జగన్‌కు బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలు కారణంగానే ఆయనను తప్పించారని వాదన తెరపైకి వచ్చింది. ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్ కు చేరవేస్తున్నారన్న సమాచారం అందింది. దీంతో ఆ వార్తలు కాస్త అటునుంచి ఎలాగో బీజేపీకి చేరుతున్నాయి. అంతేకాదు ఆరెస్సెస్- బీజేపీ కలిసి జగన్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా సీఎంకు అందిందట.

కొంతమంది ఆర్ఎస్ఎస్ నేతల అంతర్గత సంభాషణలు కాస్త జగన్ చెవిన పడటంతో ముందు జాగ్రత్తగా ఈ సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముందు సీఎస్ గా ఎల్వీని తప్పిస్తే.. ఏపీ వ్యవహారాలు.. ఆరెస్సెస్- బీజేపీలకు చేరడం ఆగుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నెమ్మదిగా పక్కా ప్రణాళిక రచించి బీజేపీని ఢీ కొట్టాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
Published by: Sulthana Begum Shaik
First published: November 4, 2019, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading