మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి... సీమవాసులకు సీఎం గుడ్ న్యూస్

ఎన్నికలకు ఆరునెలలు ముందు వచ్చి చంద్రబాబు ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం మోసం తప్ప మరోకటి కాదన్నారు జగన్.

news18-telugu
Updated: December 23, 2019, 12:44 PM IST
మూడేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ పూర్తి... సీమవాసులకు సీఎం గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్... కపడ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్ానమన్నారు. ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. 30లక్షల టన్నుల ఉక్కు కార్మాగారానికి శంకుస్థాపన చేశామన్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో 25వేలమందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామన్నారు. నాలుగేళ్ల అధికారంలో ఉండి ఏం చేయని చంద్రబాబు.. ఎన్నికలకు ఆరునెలలు ముందు వచ్చి శంకుస్థాపన చేయడం మోసం తప్ప మరోకటి కాదన్నారు జగన్.

అధికారంలోకి వచ్చి ఆరునెలలు కాగానే.. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం పరిపాలనపై తమకున్న చిత్తశుద్ధికి నిదర్శమన్నారు ముఖ్యమంత్రి. మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. 2030 నాటికి దేశానికి మూడువేల కోట్ల టన్నుల ఉక్కు అవసరం అవుతుందన్నారు. కడపకు ,రాయలసీమకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయన్నారు జగన్. పాలనతో తేడాను ప్రజలు గమనించాలన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో బతుకులు మారుతాయన్నారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన ఐరెన్ ఓర్ కోసం NMDCతో ఒప్పందం కుదిరిందన్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 23, 2019, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading