జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వని అమిత్ షా... కారణం ఇదేనా ?

అమిత్ షా, జగన్

ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు జగన్ హస్తిన బాట పట్టారని పైకి చెబుతున్నా... ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వెనుక సొంత అజెండా ఉందన్న సమాచారం వినిపిస్తోంది.

  • Share this:
    సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సాయంత్రం వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకలేదు. అయితే దీనిపై పలు ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనే షా జగన్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న వాదన తెరపైకి వస్తోంది. అయితే దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు జగన్ హస్తిన బాట పట్టారని చెబుతున్నా... ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వెనుక సొంత అజెండా ఉందన్న సమాచారం వినిపిస్తోంది. జగన్ కేసులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు అక్కడకు వెళ్లారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.

    అక్రమాస్తుల కేసులో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి... కోర్టుకు హాజరయ్యే విషయంలో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి సీబీఐ మాత్రం ససేమిరా అంటోంది. సీఎంగా ఉన్న జగన్... ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరవ్వడం పెద్ద విషయమేమి కాదని చెబుతోంది. అయితే దీనిపై జగన్ మాత్రం కోర్టు వాయిదాలతో తన అధికారిక కార్యక్రమాలకు అడ్డంకి ఏర్పడుతుందని అందుకే తనకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై సీబీఐ మాత్రం పట్టు వదలడం లేదు. దీంతో సీబీఐ, కోర్టు కేసుల వ్యవహారంపై కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాతో కలిసి చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మరి ఈరోజైనా షా ఏపీ ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇస్తారో లేదో చూడాలి.
    Published by:Sulthana Begum Shaik
    First published: