అమిత్ షాతో సీఎం జగన్ భేటీ...ప్రత్యేక హోదాపై కీలక చర్చలు

శనివారం మధ్యాహ్నం నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై మాట్లాడనున్నారు వైఎస్ జగన్.

news18-telugu
Updated: June 14, 2019, 7:15 PM IST
అమిత్ షాతో సీఎం జగన్ భేటీ...ప్రత్యేక హోదాపై కీలక చర్చలు
అమిత్ షాతో వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నాలను వేగవంతం చేశారు ఏపీ సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ నార్త్‌బ్లాక్‌లో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విజభన చట్టంలో పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై సుమారు అరగంట పాటు చర్చించారు. హోదా గురించి మోదీకి వివరించాల్సిందిగా ఆయన్ను కోరారు. విభజన హామీలను వీలైనంత త్వరగా అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు జగన్. సీఎం వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

విభజన హామీల అమలు కేంద్ర హోంమంత్రి పరిధిలోకి వస్తాయి కాబట్టి అమిత్ షాను కలిశాను. విభజన హామీలపై ఆయనతో చర్చించాం. మోదీ మనసు కరిగేలా ఒప్పించాలని ఆయను విజ్ఞప్తి చేశా. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారీ ప్రత్యేక హోదాను గుర్తు చేస్తా. నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నాం. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎలాంటి ప్రచారం చేయవద్దు.
జగన్, ఏపీ సీఎం

అమిత్ షాతో జగన్ చర్చలు


అమిత్ షాతో భేటీ అనంతరం ఇవాళ రాత్రి జన్‌పథ్‌ రోడ్డులోని నివాసంలో సీఎం జగన్‌ బస చేయనున్నారు. శనివారం వైసీపీ పార్లమెటరీ పార్టీ భేటీలో పాల్గొననున్న జగన్.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత శనివారం మధ్యాహ్నం నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతపై సీఎం జగన్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading