ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటిలిజెన్సీ చీఫ్ విశ్వజిత్ భేటీ అయ్యారు. చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటనపై చర్చించారు. దీంతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపై కూడా చర్చించారు. చంద్రబాబుపై దాడి ఘటనపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీకి పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే చంద్రబాబు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేతల ఆరోపణలు సరికాదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఏపీలో పోలీసుల తీరుపై కేంద్ర హోంశాఖకు సైతం టీడీపీ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ కోరారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అమరావతిలో చంద్రబాబు పర్యటన సమయంలో దాడి జరిగింది. చంద్రబాబు బస్సుపై రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. చంద్రబాబుపై భుజానికి లాఠీ సైతం వచ్చి తగిలిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో చంద్రబాబు భద్రతకు ఏపీలో ముప్పు ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.