Home /News /politics /

AP CM JAGAN BLESSINGS ON WOMEN STAIRS ON CHANDRABABU NAIDU NGS

Andhra Pradesh: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళపై వరాలు.. చంద్రబాబుపై సెటైర్లు

మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలపై వరాలు.. బాబుపై సెటైర్లు

మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలపై వరాలు.. బాబుపై సెటైర్లు

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్.. మొదట మహిళలపై వరాలు జల్లు కురిపించారు. కాసేటికే చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుంటూ సెటైర్లు వేశారు.

  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళపై వరాల జల్లు కురిపించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. మహిళా మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్. మహిళా హెల్ప్ డెస్క్ లను ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కలు పనిచేయనున్నాయని ప్రకటించారు. దిశ కియోస్క్ యంత్రాలను కూడా ఆయన ప్రారంభించారు. దీంతో ప్రత్యేకంగా రూపొందించిన 900 దిశ బైక్ లు అందుబాటులోకి వచ్చాయి.

  మహిళలు పని చేసే ప్రదేశాల్లో వేధింపులు నిరోధించేందుకు చట్టం ఉందని.. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో వేధింపుల నిరోధానికి విచారణకు కమిటీ తప్పని సరిగా ఉండాలని ఈ చట్టం చెబుతోంది అన్నారు. సచివాలయంలోనే మహిళల వేధింపుల నివారణ కమిటీ లేదని.. మొదట సచివాలయం నుంచే ఆ కమిటీ వేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయంలో మహిళా కమిటీ తప్పక ఉండేలా చర్యలు తీసుకుంటానన్నారు. మహిళలను ఆర్ధికంగా రాజకీయంగా, సామాజికంగా సాధికారత కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

  రేపటి తరం చిన్నారులకు కూడా సింహ భాగం పథకాలు ఇచ్చామన్నారు. అలాగే తొలిసారిగా ఈ ఏడాది బడ్జెట్ లో జెండర్ బడ్జెట్ కాన్సెప్ట్ తీసుకువస్తున్నామన్నారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ప్రభుత్వం ఉందని చెబుతూ జెండర్ బడ్జెట్ తీసుకువస్తున్నామన్నారు. అక్క చెల్లెమ్మలకు బడ్జెట్ లో ఎంత ఖర్చు చేస్తున్నామనే వివరాలను వచ్చే బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

  ప్రతి ఇంటిలోనూ మహిళలు మనల్ని ఉన్నతంగా ఉంచబట్టే ఈ స్థాయిలో ఉన్నామని అభిప్రాయపడ్డారు. భూదేవంత సహనంతో ఇంటింటా మహిళా మూర్తులు అందిస్తోన్న సేవలకు ఆర్థికంగా ఎలాంటి కొలమానాలులేవన్నారు. రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 2011 జనాభా లెక్కల వివరాల ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే ఉందని.. ఇప్పటికీ 40 శాతం మహిళలు చదువులకు దూరంగా ఉన్నారని.. అన్ని అంశాల్లోనూ స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్ష ఇలాగే వదిలేస్తే సమాజం ఎటు పోతుందో ఆలోచన చేయాలన్నారు.

  మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. చదువు రాని వారు ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని తెచ్చామన్నారు. ఆడపిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు గొప్పగా చదవాలని పథకాలు చేపట్టిను అన్నారు. 44.50 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 85 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి తీసుకువచ్చామన్నారు. ఏడాదికి 6500 కోట్ల రూపాయల చొప్పున రెండేళ్లుగా 13,022 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు తెలిపారు.

  అక్కా చెల్లెళ్లపై ఎవరైనా అన్యాయం చేస్తే బుద్ది చెప్పేందుకు 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో పబ్లిక్ల్ ప్రాసిక్యూటర్లు ఏర్పాటు చేసామన్నారు. మహిళలపై నేరాలను 7.5 శాతం తగ్గించగలిగాం అన్నారు. నేరాల దర్యాప్తుకు 100 నుంచి 53 రోజులకు తగ్గించామని గుర్తు చేశారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా ఇకపై మహిళా ఉద్యోగులకు 15 క్యాజువల్ లీవులను 20 రోజులకు పెంచుతూ ప్రకటన చేశారు. అలాగే చెల్లేమ్మలకోసం బయో డీ గ్రేడబుల్ శానిటరీ న్యాప్ కిన్స్ ను తీసుకువస్తున్నామన్నారు. 7 నుంచి 12 తరగతి చదువుతున్న చెల్లెమ్మలకు జూలై 1 నుంచి ఉచితంగా న్యాప్ కిన్స్ ఇస్తామన్నారు. చేయూత కిరణా దుకాణాల్లో తక్కువ ధరకే న్యాప్ కిన్స్ అందిస్తామని తెలియజేశారు.

  మహిళ దినోత్సవం రోజున వరాలు కురిపించిన సీఎం జగన్.. అటు మాజీ సీఎం చంద్రబాబు పై సెటైర్లు వేశారు. తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి చేసిన మాటలు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. కోడలు మగపిల్లాడ్ని కంటే... అత్త వద్దంటుందా అన్నారు. అప్పట్లో స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలని అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ఆలోచనలేకుండా ఇలాంటి మాటలు అన్నప్పుడు, విన్నప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Chandrababu naidu, Cm jagan, Tdp, Womens day 2021, Ycp, Ys jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు