ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు...ఏపీలో వైఎస్ జగన్

మరోవైపు అమరావతి నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుంటే... అటు ప్రతిపక్ష నేత హైదరాబాద్ నుంచి తన పార్టీ మకాం మార్చేశారు. మంగళవారమే ఆయన కడప జిల్లా పులివెందుకులకు చేరుకున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 9:06 AM IST
ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు...ఏపీలో వైఎస్ జగన్
చంద్రబాబు, జగన్ (File)
news18-telugu
Updated: May 15, 2019, 9:06 AM IST
సార్వత్రిక ఎన్నికల తర్వాత బిజీ బిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే ప్రైవేట్‌ కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన అనంతరం తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి బయల్దేరి వెళ్తారు. అయితే చంద్రబాబు పర్యటనలో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నా... కాంగ్రెస్‌ నేతలతో సీఎం మంతనాలు జరిపే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎన్నికల బిజీలో పడిపోయిన బాబు... పెద్దగా హైదరాబాద్ వైపు చూసింది లేదు. ఏపీతో పాటు కేంద్ర రాజకీయాలపై కూడా దృష్టిపెట్టడంలో ఏపీ సీఎం బిజీగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. తాజా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కూడా కలిసి వచ్చారు. దీంతో చంద్రబాబు హైదరాబాద్ పర్యటన వెనుక కూడా రాజకీయ అంశాలు దాగి ఉన్నాయనే పలువురు భావిస్తున్నారు.

మరి కొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు బిజీ బిజీగా కనిపిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ ,అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కేబినెట్ భేటీ కూడా నిర్వహించారు. ఇందులో ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన కరువు, ఫణి తుఫాను పరిహారం, తాగునీటి సమస్య, ఉపాధి హామీ పథకాలపై మాత్రమే చర్చించారు. దీంతో పాటు ఉండవల్లిలోని తన నివాసంలో మహానాడు కార్యక్రమంపై కూడా నిర్ణయం తీసుకున్నారు.ఈ ఏడాది మహానాడును వాయిదా వేసేందుకు చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమరావతి నుంచి చంద్రబాబు హైదరాబాద్ వస్తుంటే... అటు ప్రతిపక్ష నేత హైదరాబాద్ నుంచి తన పార్టీ మకాం మార్చేశారు. మంగళవారమే ఆయన కడప జిల్లా పులివెందుకులకు చేరుకున్నారు. అక్కడ జగన్ పార్టీ నేతలతో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలోనే పర్యటించనున్నారు.

First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...