HOME »NEWS »POLITICS »ap cm chandrababu naidu to meet mk stalin and kumara swamy

త్వరలో స్టాలిన్, కుమారస్వామితో చంద్రబాబు భేటీ

త్వరలో స్టాలిన్, కుమారస్వామితో చంద్రబాబు భేటీ
త్వరలో స్టాలిన్, కుమారస్వామితో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు

ముందుగా చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన తర్వాత, బెంగుళూరుకు వెళ్లి కుమారస్వామితో చంద్రబాబు భేటీ అవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. 

  • Share this:
    బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాల్లో భాగంగా త్వరలో ఏపీ సీఎం చంద్రబాబు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీకానున్నారు. వీరిద్దరితో భేటీ ఈ నెల 20 తర్వాత ఉండొచ్చని తెలుస్తోంది. చంద్రబాబు స్వయంగా చెన్నై, బెంగుళూరుకు వెళ్లి వారితో భేటీకానున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో బలమైన కూటమిని ఏర్పాటు చేయడంపై స్టాలిన్‌, కుమార స్వామితో చంద్రబాబు చర్చిస్తారు. ఈ రెండు భేటీలకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు వచ్చే వారం ఖరారు కానున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. ముందుగా చెన్నై వెళ్లి స్టాలిన్‌ను కలిసిన తర్వాత, బెంగుళూరుకు వెళ్లి కుమారస్వామితో చంద్రబాబు భేటీ అవుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

    గత వారం దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు...స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బలమైన కూటమిని ఏర్పాటు చేయడంపై వారిద్దరు చర్చించారు. గతంలో ఏం జరిగిందే మరిచిపోయి ముందుకు వెళ్లాలని తాము నిర్ణయించుకున్నట్లు భేటీ తర్వాత చంద్రబాబు, రాహుల్ గాంధీ మీడియా ఎదుట ప్రకటించారు.



    జనవరిలో దిల్లీలో బీజేపీ వ్యతిరేక పార్టీల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీల నేతలు హాజరుకానున్నారు.
    Published by:Janardhan V
    First published:November 06, 2018, 10:27 IST

    टॉप स्टोरीज