సీఎస్ సీరియస్ అవుతున్నారని సమాచారం. అంతేకాదు ఆయన తనపై నిఘా పెడుతున్నారంటూ ఏపీ ఎన్నికల అధికారి గోపాల్ ద్వివేదికి ఫిర్యాదు కూడా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అక్కడ ప్రస్తుతం సీఎస్ వర్సెస్ సీఎం నడుస్తోంది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీఎం చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పుణేఠాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించింది. అయితే ఎల్వీ నియామకంపై ఏపీ సీఎం చంద్రబాబు గరం గరం అయ్యారు. జగన్ కేసుల్లో నిందితుడైన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎలా సీఎస్‌గా నియమిస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కొన్ని రోజుల నుంచి ఏపీలో ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్న సమీక్షలపై టీడీపీ నిఘా పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సీఎస్ ఎల్వీ సమీక్షలకు హజరవుతున్న కొందరు టీడీపీ నేతలు.. అక్కడ జరుగుతున్న వ్యవహారాల్ని అధినేతకు చేరవేస్తున్నట్లు సమాచారం. రివ్యూ మీటింగ్స్‌లో ఏం జరుగుతోందో పూస గుచ్చినట్లు పార్టీలో పెద్దలకు చేరవేస్తున్నారట. దీంతో టీడీపీకి సీఎస్‌ను విమర్శించడానికి కొత్త ఆయుధాలు దొరుకుతున్నట్లు అవుతోంది. అంతేకాదు ... సీఎస్ తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు కూడా టీడీపీకి ముందే తెలిసిపోతున్నాయట. దీంతో సీఎస్ సీరియస్ అవుతున్నారని సమాచారం. అంతేకాదు ఆయన తనపై నిఘా పెడుతున్నారంటూ ఏపీ ఎన్నికల అధికారి గోపాల్ ద్వివేదికి ఫిర్యాదు కూడా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పనిచేసిన చాలామంది అధికారులు సైతం టీడీపీకే వంతపాటు పడుతున్నారట. దీంతో ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రోజురోజుకు చోటుచేసుకుంటున్న పరిణామాల్ని సద్దుమణిగించడంలో ఇటు ఈసీ .. అటు సీఎఎస్ ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.