ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు పాదయాత్ర

రాష్ట్రపతి భవన్ దిశగా పాదయాత్రాగా బయల్దేరారు. సీఎంతో పాటు ప్రజా సంఘాల నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 12:39 PM IST
ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌కు చంద్రబాబు పాదయాత్ర
చంద్రబాబు నాయుడు(File)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 12:39 PM IST
ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం మరికాసేపట్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌తో భేటీకానున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయల్దేరారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చంద్రబాబు హీటెక్కించారు. రాష్ట్రపతి భవన్ దిశగా పాదయాత్రాగా బయల్దేరారు. సీఎంతో పాటు ప్రజా సంఘాల నేతలు, ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రమంతా ఢిల్లీ రోడ్డులపై నడుస్తుందన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు.

11 మంది సభ్యుల బృందంతో ఆయన రాష్ట్రపతితో భేటీ కానున్నారు చంద్రబాబు. మొత్తం ఏపీకి సంబంధించిన 18డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి అందివ్వనున్నట్లు సమాచారం. ఏపీ భవన్ నుంచి ర్యాలీగా సీఎం చంద్రబాబు రాష్ట్రపతి భవన్‌కు మరికాసేపట్లో  చేరుకోనున్నారు.



First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...