రాహుల్‌తో చంద్రబాబు భేటీ.. ఈవీఎం, వీవీప్యాట్‌లపై చర్చ

భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై చర్చించినట్లు తెలుస్తోంది. గత జనవరిలోనూ టీడీపీ అధినేత కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో బీజేపీయేతర కూటమి ఎజెండాపై చర్చించారు.

news18-telugu
Updated: May 8, 2019, 10:56 AM IST
రాహుల్‌తో చంద్రబాబు భేటీ.. ఈవీఎం, వీవీప్యాట్‌లపై చర్చ
రాహుల్ గాంధీతో చంద్రబాబు (ఫైల్ ఫోటో)
  • Share this:
దేశంలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల సీఎంల పర్యటనలపైనే దేశవ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ దిశగా తెలంగాణ సీఎం కేసీఆర్ వేగంగా పావులు కదుపుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాల పర్యటనలు, నేతల భేటీలతో బిజీగా ఉన్నారు. తాజాగా, ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ అయ్యారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు సుప్రీం కోర్టు నో చెప్పడంతో చంద్రబాబు సహా 21 విపక్ష పార్టీలకు షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో రాహుల్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 30 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై చర్చించినట్లు తెలుస్తోంది. గత జనవరిలోనూ టీడీపీ అధినేత కాంగ్రెస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో బీజేపీయేతర కూటమి ఎజెండాపై చర్చించారు.

కాగా, రెండు రోజుల క్రితమే చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని కోరారు. ఈసీ కొందరి విషయంలో ఉదాసీనతతో వ్యవహరిస్తోందని రాజకీయ పార్టీలు, ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ‘వీవీ ప్యాట్, ఈవీఎంలోని ఓట్ల మధ్య బేధం వస్తే వీవీ ప్యాట్‌ స్లిప్పుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుంటామని ఈసీ చెబుతోంది. 5 పోలింగ్ బూత్‌ల్లో మాత్రమే స్లిప్పులను లెక్కించడమంటే 2 శాతం మాత్రమే. ఈసీ ఈ నిర్ణయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశముందని అంగీకరించింది. 2శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను మాత్రమే లెక్కించడం ద్వారా మిగిలిన 98 శాతంలో జరిగే ట్యాంపరింగ్‌ను ఎలా నిరోధిస్తారు? ఒక్కో శాసనసభ స్థానం పరిధిలో 50 శాతం వీవీ ప్యాట్‌ స్లిప్పులను ఒకేసారి అన్ని కౌంటింగ్‌ టేబుళ్లపైన సమాంతరంగా లెక్కిస్తే తొమ్మిది గంటల వ్యవధిలో గణన ప్రక్రియ పూర్తయిపోతుంది’ అని ఆయన లేఖలో వివరించారు.

First published: May 8, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading