ఏపీకి న్యాయం చేయండి... రాష్ట్రపతికి చంద్రబాబు బృందం వినతి

రాష్ట్రపతి కోవింద్‌కు 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయలేదని ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 5:20 PM IST
ఏపీకి న్యాయం చేయండి... రాష్ట్రపతికి చంద్రబాబు బృందం వినతి
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిసిన చంద్రబాబు బృందం
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 12, 2019, 5:20 PM IST
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ఏపీ సీఎం చంద్రబాబు బృందం సమావేశంమైంది. ఈ సందర్భంగా కోవింద్‌కు 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయలేదని ఫిర్యాదు చేశారు. ఏపీకి న్యాయం చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు... ప్రజా సంఘాల నేతలతో కలిసి చంద్రబాబు నేతృత్వంలో 11 మంది సభ్యులు రాష్ట్రపతి వద్దకు వెళ్లారు చంద్రబాబు. ఈ బృందంలో అశోక్ గజపతిరాజు, చినరాజప్ప, కళా వెంకట్రావ, నక్కా ఆనంద్ బాబు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, చలసాని శ్రీనివాసరావు, యు. మురళీ కృష్ణ, ఐవీ సుబ్బారావు, ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, శివాజీ ఉన్నారు.

andhra pradesh, ap cm chandrababu naidu, president of india, president kovind, chandrababu meet kovind, rashtrapati bhavan, delhi, రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో చంద్రబాబు పాదయాత్ర, రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు, కోవింద్‌తో చంద్రబాబు భేటీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రపతి భవన్ వద్ద చంద్రబాబు బృందం


అంతకుముందు ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రమంతా ఢిల్లీ రోడ్డులపై నడుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు. నిన్న చంద్రబాబు ఢిల్లీ వేదికగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు పెద్ద ఎత్తున జాతీయ నేతలంతా మద్దతు పలికారు. దీక్షా శిబరానికి వచ్చి మరి చంద్రబాబుకు సంఘీ భావం తెలిపారు.

First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...