చంద్రబాబు పుట్టింది ఏప్రిల్ 20... ఆయనో 420 అంటూ జగన్ సెటైర్

ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి (File)

చంద్రబాబు పుట్టినతేదీ ఏప్రిల్‌ 20 అన్నారు జగన్. అంటే 4వ నెల, 20వ తేదీ. అంటే 420 అన్నారు. అందుకే ఆయన బుద్ధులు కూడా అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు జగన్.

  • Share this:
    ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌కోట నియోజకవర్గంలో పర్యటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక్క పడికూడా చేయలేదన్నారు. ప్రజలు మెచ్చుకునే మూడు పనులైనా టీడీపీ చేసిందా అంటూ ప్రశ్నించారు. ఎల్ కోట, వేపాడ, కొత్తవలస మండలాల్లో నిరంతరం కరువే అన్నారు. దగ్గర్లోనే రైవాడ రిజర్వాయర్ ఉన్నా తాగు, సాగునీటికి కష్టాలు తప్పడం లేదన్నారు. రైవాడ రిజర్వాయర్ నుంచి విశాఖ పారిశ్రామిక వాడకు నీరు తరలిస్తున్నారని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశానన్నారు. చంద్రబాబు వచ్చాక పరిశ్రమలు మూతపడ్డాయని ఆరోపించారు. ఎస్‌కోటలో చక్కెర కర్మాగారం, భీమిసింగి కంపెనీ మూతపడ్డాయన్నారు. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ కంపెనీని దగ్గరుండి మూసివేయించారని విమర్శించారు.

    మహానేత వైయస్సార్‌ సీఎం కాగానే, దాన్ని తెరిపించారన్నారు. మళ్లీ 2014లో చంద్రబాబు సీఎం కాగానే కంపెనీ రూ.43 కోట్ల అప్పుల్లో పడిందని ఆరోపించారు. విశాఖ నగరానికి అతి సమీపంలో ఉన్నా ఈ 5 ఏళ్లలో కనీసం ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నిరు కొత్త పరిశ్రమలు రాకపోగా, జూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయిస్‌ కంపెనీలు విద్యుత్‌ ఛార్జీలతో మూతబడుతున్నాయన్నారు. రెల్లి వద్ద గిరిజన వర్సిటీ పనులు 5 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఆ ఏడాది ఏప్రిల్‌లో 650 వాగ్ధానాలు చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ ఏప్రిల్‌లోమోసం చేసేందుకు వందల వాగ్ధానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

    చంద్రబాబు పుట్టినతేదీ ఏప్రిల్‌ 20 అన్నారు జగన్. అంటే 4వ నెల, 20వ తేదీ. 420 అన్నారు. అందుకే ఆయన బుద్ధులు కూడా అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు జగన్. చంద్రబాబు పుట్టినరోజు మహాత్యమో లేక నైజమో కానీ. ఆయన తన జీవితమంతా ప్రజలను ఫూల్స్‌ను చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు.చంద్రబాబు సీఎం కాగానే చేసిన తొలి 5 సంతకాలకు దిక్కూ దివాణం లేదన్నారు. ఆ తర్వాత 2014, ఆగస్టు 15న ప్రతి జిల్లాకు హామీలు ఇచ్చారన్నారు. అవే విషయాలను అసెంబ్లీలో కూడా ప్రకటించారన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తానని చెప్పి, చేసింది అవినీతి మాత్రమే అన్నారు జగన్. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలోనే అంత అవినీతి ఎవరూ చేయలేదన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన చంద్రబాబు, గత 5 ఏళ్లుగా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడని మండిపడ్డారు.
    First published: