నిధులకు ఇబ్బంది లేదు... పోలవరం ఆగదు... కర్ణాటకలో ప్రచారం చేస్తానన్న చంద్రబాబు

ఏపీలో చివర విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... మొదటి విడతలో జరిపారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు.

news18-telugu
Updated: April 17, 2019, 6:31 PM IST
నిధులకు ఇబ్బంది లేదు... పోలవరం ఆగదు... కర్ణాటకలో ప్రచారం చేస్తానన్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో నిధుల కొరత ఉందన్న వార్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. సంపద సృష్టించడంతో పాటు ఆ సంపదను పేదలకు పంచుతున్నామని అన్నారు. పరిపాలనకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదని ఆయన వివరించారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పనులు 69 శాతం పూర్తయ్యిందని... జూన్, జూలై నాటికి గ్రావిటితో నీళ్లు అందిస్తామని అన్నారు. ఏపీలో చివర విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... మొదటి విడతలో జరిపారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు.

సీఎస్, ఎస్పీలను బదిలీ చేస్తే మాజీ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కొందరు మాజీ ఐఏఎస్‌లు సొంత ఎజెండాతో కేంద్రానికి, ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు. కొన్ని చోట్ల ఈవీఎంలను మరుసటి రోజు తీసుకొచ్చినట్టు వార్తలు వస్తున్నాయన్న చంద్రబాబు... ఈవీఎంలు ఇంట్లో పెట్టుకుని తీసుకొస్తే ఏం జరిగినట్టు అని ప్రశ్నించారు. ప్రతిపక్ష సీఎంల హెలికాప్టర్లు మాత్రమే తనిఖీ చేస్తారా అని ఆయన మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కంటే ఎవరైనా ప్రధానిగా బాగా పని చేయగలరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నోట్లు రద్దు, జీఎస్టీ అతి పెద్ద తప్పులు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో కూర్చుంటే ఏపీలో సమస్యలు ఎలా తెలుస్తాయని పరోక్షంగా జగన్‌పై విమర్శలు గుప్పించారు. తాను ఎల్లుండి రాయ్‌చూర్ వెళుతున్నానని స్పష్టం చేసిన చంద్రబాబు... అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కుమారస్వామితో కలిసి ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలిపారు.

First published: April 17, 2019, 6:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading