Home /News /politics /

AP CM CHANDRABABU NAIDU FIRES ON EC AND AP CS SAYS HE WILL ARRANGE CABINET MEETING NEXT WEEK AK

వచ్చేవారం కేబినెట్ భేటీ... ఈసీతో చంద్రబాబు అమీతుమీ ?

చంద్రబాబునాయుడు

చంద్రబాబునాయుడు

ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న ఎన్నికల కోడ్ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సంఘం ప్రవర్తన వింతగా ఉందన్న చంద్రబాబు... కేవలం ఎన్నికలు నిర్వహించడం వరకే ఈసీ పని అని... సాధారణ పరిపాలన విషయంలో ఈసీ జోక్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...
    ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్నికల సంఘం మధ్య నడుస్తున్న ఎన్నికల కోడ్ వివాదం పతాకస్థాయికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో ఎన్నికల సంఘం, ఏపీ సీఎస్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఫణి తుఫాను బాధితులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలను మీడియాకు వివరించిన చంద్రబాబు...ఈ సందర్భంగా ఈసీపై మరోసారి మండిపడ్డారు. ఎన్నికల సంఘం ప్రవర్తన వింతగా ఉందని వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలు నిర్వహించడం వరకే ఈసీ పని అని... సాధారణ పరిపాలన విషయంలో ఈసీ జోక్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మోదీ ఏం మాట్లాడినా ఈసీకి సంగీతం విన్నట్టుగా ఉంటుందని ఆరోపించారు. తాము చాలా ఎన్నికలు చూశామని... తమకే ఇవే మొదటి ఎన్నికలు కావని అన్నారు.

    ఏపీ సీఎస్ వ్యవహారశైలిని కూడా సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. అన్ని రాష్ట్రాల్లో సీఎస్‌ ముఖ్యమంత్రి దగ్గరకు వస్తారు. ఇక్కడ మాత్రం రారని అన్నారు. సీఎం దగ్గరకు వచ్చి మాట్లాడాలని సీఎస్‌కు తెలియదా ? అని ప్రశ్నించారు. అధికారుల బాధ్యత రాహిత్యాన్ని సహించను. సీఎస్ కొన్ని నెలలు ఉంటారని... ఇలాంటి వారిని 40 ఏళ్లలో చాలామంది చూశానని అన్నారు. వచ్చే సోమవారం పోలవరం వెళుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను ఎవరికీ భయపడనని, ఎవరి బాధ్యత వారు నిర్వహిస్తే మంచిది అని అన్నారు. హద్దులు దాటితే కేబినెట్ భేటీ నిర్వహించి బిజినెస్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వచ్చే వారం మంత్రివర్గం సమావేశం ఉంటుందని అన్నారు. రాజ్యాంగం ఈసీకి అధికారాలిచ్చిందని... మాకు అధికారులు ఇచ్చిందని చంద్రబాబు స్పష్టం చేశారు. మా ఇష్ట ప్రకారం మాట్లాడతామని ఈసీ అనడం సరికాదని అన్నారు.







    First published:

    Tags: AP CS LV Subramanyam, Chandrababu naidu, Election Commission of India, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు