చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ములాయం

చంద్రబాబుతో తన పరిచయం ఈ నాటిది కాదన్నారు ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్. చంద్రబాబను తానెప్పుడూ మరిచిపోలేనన్నారు. తన ఆరోగ్యం సరిగా లేకపోయినా... చంద్రబాబు దీక్షకు వచ్చానన్నారు ములాయం సింగ్,

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 4:37 PM IST
చంద్రబాబుతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ములాయం
చంద్రబాబు దీక్షలో ములాయం సింగ్ ( ట్విట్టర్ ఫోటో)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 4:37 PM IST
చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చారు సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్. బాబు ధర్మపోరాట దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. చంద్రబాబుతో మాకెంతో సాన్నిహిత్యం ఉందన్నారు ప్రధాని అభ్యర్థిత్వానికి చంద్రబాబు గతంలో తనపేరును ప్రస్తావించారని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సమాజ్ వాదీ పార్టీ అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశ ప్రజల్ని అవినీతి పట్టి పీడిస్తుందన్నారు. ముఖ్యంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అందరం కలిసి చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలన్నారు. చంద్రబాబుపై తమకెంతో విశ్వాసం ఉందన్నారు.

చంద్రబాబు చేస్తున్న దీక్ష దేశమంతటా ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు ములాయం సింగ్. చంద్రబాబు సాధారణ నాయకుడు కాదంటూ కొనియాడారు. అన్యాయంపై పోరాడుతున్న నాయకుడన్నారు. అన్నివర్గాల ప్రజలకు చంద్రబాబు అండగా ఉంటారన్నారు. తమ ఇద్దరి మధ్య పరిచయం ఈ నాటిది కాదన్నారాయన. చంద్రబాబును తానెప్పుడూ మరిచిపోలేనన్నారు. తన ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా... చంద్రబాబు దీక్షకు వచ్చానని.... దీంతో తన ఆరోగ్యం మెరుగైపోతుందన్నారు ములాయం సింగ్. చంద్రబాబు లాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. తప్పకుండా ఆయన యూపీకి రావాలని కోరారు. ఎప్పటికీ చంద్రబాబుకు తమ మద్దతు ఉంటుందన్నారు ములాయం.


First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...