AP CM Chandrababu Naidu Deeksha: ధర్మపోరాట దీక్షలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

AP CM Chandrababu Naidu Deeksha Live: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దీక్షకు హాజరయ్యారు. వేలాదిగా ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు తరలివచ్చి మద్దతు తెలిపారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 9:33 AM IST
AP CM Chandrababu Naidu Deeksha: ధర్మపోరాట దీక్షలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్ష (File)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 9:33 AM IST
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర వైఖరికి నిరసనగా ధర్మపోరాట దీక్షకు దిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. ప్రముఖులకు నివాళులర్పించిన అనంతరం నల్లచొక్కా వేసుకొని చంద్రబాబు దీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దీక్షకు హాజరయ్యారు. వేలాదిగా ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు తరలివచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు సీఎం చేస్తున్న దీక్షకు మద్దుతుగా ఏపీలో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

చంద్రబాబు కొద్దిసేపటి క్రితం ఎంపీలతో కలిసి రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ భవన్‌కు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత దీక్ష ప్రారంభించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు అంటే సుమారుగా 12 గంటలపాటు దీక్ష కొనసాగనుంది. దీక్షకు సంఘీభావం తెలుపుతూ అందులో పాల్గొనేందుకు ఏపీ నుంచి వివిధ సంఘాల నేతలు, విద్యార్థి నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ సహా జాతీయ పార్టీ నేతలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలుపుతూ హాజరయ్యారు.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...