‘చౌకీదార్ చోర్ హై’అంటూ ధర్మపోరాట దీక్షలో రాహుల్ ఫైర్

AP CM Chandrababu Naidu Deeksha in Delhi: ఏపీకి ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అన్నారు రాహుల్ గాంధీ. ఏపీ ప్రజలకు అండగా ఉండేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. మోదీ ఎక్కడకు వెళ్లిన అబద్ధాలు చెబుతారంటూ విమర్శించారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:06 PM IST
‘చౌకీదార్ చోర్ హై’అంటూ ధర్మపోరాట దీక్షలో రాహుల్ ఫైర్
ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ (ఏఎన్ఐ ట్విట్టర్)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:06 PM IST
ఢిల్లీకి వచ్చిన తెలుగువారందరికి ఘనస్వాగతమన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ప్రధాని ఇచ్చిన హామీల్ని అమలు చేయాలా వద్దా ? అంటూ ప్రశ్నించారు. ఏపీకి ప్రజలకు ఇచ్చిన హామీల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉండేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. మోదీ ఎక్కడకు వెళ్లిన అబద్ధాలు చెబుతారంటూ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ ఏపీ ప్రజల్ని మోసం చేశారన్నారు.

చౌకీ దార్ చోర్ అంటూ మోదీని ఉద్దశిస్తూ వార్తా పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. రాఫెల్ డీల్ కోసం మోదీ ..ఏపీకి ఇవ్వాల్సిన నిధులు తీసుకెళ్లి ఓ వ్యక్తికి కట్టబెట్టారని ఘాటుగా విమర్శలు చేశారు రాహుల్. మనమంతా కలిసి మోదీని, బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలన్నారు. మోదీ ప్రధానిగా ఇంకా రెండు నెలలే ఉండబోతున్నారన్నారు రాహుల్.First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...