ఏపీకి ప్రత్యేక హోదా హామీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే: మన్మోహన్ సింగ్

AP CM Chandrababu Naidu Deeksha in Delhi: . ఏపీకి ఇచ్చిన విభజన హామీల్ని అప్పుడు అన్నిపార్టీలు అంగీకరించాయన్నారు మన్మోహన్ సింగ్. ఏపీ ప్రత్యేక హోదా హామీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే అన్నారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:08 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా హామీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే: మన్మోహన్ సింగ్
చంద్రబాబు దీక్షా శిబిరంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 3:08 PM IST
ఢిల్లీ వేదికగా చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మద్దతు తెలిపారు మాజీ ప్రధాని మన్మోమన్ సింగ్. ఏపీ భవన్‌లో దీక్షా శిబిరానికి వచ్చిన ఆయన... బాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీల్ని అప్పుడు అన్నిపార్టీలు అంగీకరించాయన్నారు మన్మోహన్ సింగ్. ఏపీ ప్రత్యేక హోదా హామీ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే అన్నారు. చంద్రబాబు చేస్తున్న కృషికి అందరూ సహకరిస్తామన్నారు మన్మోహన్.

ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని కేంద్ర వైఖరికి నిరసనగా ధర్మపోరాట దీక్షకు దిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు దీక్ష ప్రారంభించారు. ప్రముఖులకు నివాళులర్పించిన అనంతరం నల్లచొక్కా వేసుకొని చంద్రబాబు దీక్షలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు... దీక్షకు హాజరయ్యారు. వేలాదిగా ప్రజలు కూడా చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు తరలివచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు సీఎం చేస్తున్న దీక్షకు మద్దుతుగా ఏపీలో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.


First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...