మోదీ ఏపీకి వచ్చి కామెడీ చేశారు: అశోక్ గజపతి రాజు

AP CM Chandrababu Naidu Deeksha in Delhi: ప్రధాని మోదీపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే... ఎలా ఉంటుందని ప్రశ్నించారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు. భార్యను వదిలేసి కనీసం త్రిపుల్ తలాక్ కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 1:00 PM IST
మోదీ ఏపీకి వచ్చి కామెడీ చేశారు: అశోక్ గజపతి రాజు
మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ( ఫేస్ బుక్ ఫోటో)
Sulthana Begum Shaik | news18-telugu
Updated: February 11, 2019, 1:00 PM IST
ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి కామెడీ చేశారన్నారు మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేశామన్నారు. వ్యక్తిగత దూషణల వల్ల సాధించింది ఏం లేదన్నారు. మోదీ ఏపీకి వెళ్లి చాలా చులకనగా మాట్లాడారని విమర్శించారు. ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే... ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు. భార్యను వదిలేసి కనీసం త్రిపుల్ తలాక్ కూడా చెప్పలేదని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. అందరిలో చైతన్యం తీసుకొచ్చేలా ప్రధాని ప్రసంగం ఉండాలన్నారు.

ప్రధాని స్థాయికి దిగజారి మోదీ విమర్శలు: సుజనా చౌదరి
విభజన హామీల కోసమే ధర్మ పోరాట దీక్షకు దిగామన్నారు ఎంపీ సుజనా చౌదరి. ఏపీపై కేంద్రం చిన్న చూపు చూస్తుందన్నారు. ఏపీకి రావాల్సిన హక్కుల్నే కోరుతున్నామన్నారు. చట్టంలో పొందుపరిచిన వాటినే అడుగుతున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని అమలు చేయాలన్నారు. దేశంలో ఏపీ భాగం కానుట్లుగా కేంద్రం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రధాని తమ స్థాయి దిగజారి విమర్శలు చేస్తున్నారన్నారు సుజనా. రానున్న రోజుల్లో మోదీ గద్దె ఎక్కకుండా దింపడమే తన లక్ష్యమన్నారు మరో ఎంపీ గల్లా జయదేవ్.

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...